For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

డేవిడ్ వార్నర్‌కు షాకిచ్చిన ఆస్ట్రేలియా!

రిటైర్మెంట్‌పై యూటర్న్ తీసుకున్న ఆస్ట్రేలియా మాజీ డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు సీఏ(క్రికెట్ ఆస్ట్రేలియా) షాకిచ్చింది. అతన్ని మళ్లీ జట్టులోకి తీసుకోమని ఆస్ట్రేలియా సెలెక్టర్ జార్జ్ బెయిలీ స్పష్టం చేశాడు. వన్డే ప్రపంచకప్ 2023 విజయంతో 50 ఓవర్ల ఫార్మాట్‌కు టీ20 ప్రపంచకప్ 2024‌తో పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన డేవిడ్ వార్నర్.. ఈ ఏడాది ఆరంభంలో పాకిస్థాన్‌తో జరిగిన టెస్ట్‌ సిరీస్‌తో సుదీర్ఘ ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పాడు.

మూడు ఫార్మాట్ల నుంచి తప్పుకున్న అతను ప్రపంచవ్యాప్తంగా జరిగే టీ20 లీగ్స్ మాత్రమే ఆడుతానని తెలిపాడు. అయితే ఇటీవల తన రిటైర్మెంట్‌పై వార్నర్ మనసు మార్చుకున్నాడు. ఆస్ట్రేలియా తరఫున మరోసారి బరిలోకి దిగాలని ఉందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. సెలెక్టర్లు అవకాశం కల్పిస్తే పాకిస్థాన్ వేదికగా జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆడుతానని తన మనసులోని కోరికను బయటపెట్టాడు.

Australia s national selector George Bailey confirms No David Warner for Champions Trophy 2025 squad

అయితే డేవిడ్ వార్నర్‌ను ఛాంపియన్స్ ట్రోఫీకి పరిగణలోకి తీసుకోమని ఆ జట్టు సెలెక్టర్ స్పష్టం చేశాడు. 'డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. అతను ఆస్ట్రేలియా తరఫున మూడు ఫార్మాట్లలో అద్భుతంగా ఆడాడు. అందుకు వార్నర్‌ను అభినందించాలి. కానీ, పాకిస్థాన్‌లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి అతడిని మేం పరిగణలోకి తీసుకోవట్లేదు. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు వేర్వేరు ఆటగాళ్లతో ముందుకెళ్తోంది.'అని బెయిలీ వివరించాడు.

'అంతర్జాతీయ క్రికెట్‌లో నా అధ్యాయం ముగిసింది. సుదీర్ఘ కాలం అత్యున్నత క్రికెట్ ఆడటం గొప్ప అనుభూతినిచ్చింది. ఆస్ట్రేలియా నా జ‌ట్టు. నా కెరీర్ ఎక్కువగా అంతర్జాతీయ క్రికెట్‌లోనే కొనసాగింది. ఇలా ఆడటం గర్వంగా ఉంది. అన్ని ఫార్మాట్లలో 100+ మ్యాచ్‌లు ఆడటం నా కెరీర్ హైలైట్. ఈ ప్రయాణంలో స‌హ‌క‌రించిన అందరికి ధ‌న్య‌వాదాలు.

మన అనుభవం ఇతరులకు ఎవరికీ తెలియదు. క్రికెట్ అభిమానులందరినీ నేను అలరించానని అనుకుంటున్నా. ముఖ్యంగా టెస్టుల్లో! ఇతరుల కంటే వేగంగా ఆడుతూ ఫ్యాన్స్‌ను అలరించాను. ఇక కొన్నాళ్లు ఫ్రాంచైజీ క్రికెట్ ఆడతాను. అలాగే నేను ఎంపికైతే, ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా తరఫున క్రికెట్ ఆడటానికి కూడా సిద్ధంగా ఉన్నాను'అని డేవిడ్ వార్నర్ సోషల్ మీడియా వేదికగా ఓ సుదీర్ఘ పోస్ట్‌లో రాసుకొచ్చాడు.

2009లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన 37 ఏళ్ల వార్నర్ సుమారు 15 ఏళ్ల పాటు ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించాడు. వార్నర్ 112 టెస్టులు, 161 వన్డేలు, 110 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 8786, వన్డేల్లో 6932 పరుగులు, పొట్టి ఫార్మాట్‌లో 3277 రన్స్ సాధించాడు.

Story first published: Monday, July 15, 2024, 17:25 [IST]
Other articles published on Jul 15, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+