
లానినా.. మ్యాచ్ జరగనిచ్చేనా?
ముఖ్యంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరిగే సిడ్నీలో దీని ప్రభావం మరి ఎక్కువగా ఉంది. శనివారం 90 శాతం వర్షం కురిసే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలోనే టీ20 ప్రపంచకప్ 2022 సూపర్ 12 తొలి మ్యాచ్‌పై నీలి నీడలు కమ్ముకున్నాయి. వర్షం భారీగా వస్తే బంతి పడకుండానే మ్యాచ్ రద్దయ్యే అవకాశం ఉంది. కొంచెం బ్రేక్ ఇచ్చినా.. కనీసం ఐదు ఓవర్ల పాటు అయినా మ్యాచ్‌ను నిర్వహించనున్నారు. ఏది ఏమైనప్పటికీ.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మ్యాచ్ లానినాపైనే ఆధారపడి ఉంది.

విజయమే లక్ష్యంగా..
డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఆస్ట్రేలియా, గతేడాది రన్నరప్‌గా న్యూజిలాండ్ ఈ టోర్నీలో తొలి మ్యాచ్ ఆడనున్నాయి. గతేడాదిలానే మరోసారి న్యూజిలాండ్ ఓడించాలని ఆసీస్ భావిస్తుంటే.. ప్రతీకారం తీర్చుకోవాలని కివీస్ పట్టుదలతో ఉంది. సన్నాహకం కోసం ముందుగానే ఆస్ట్రేలియాకు వచ్చిన న్యూజిలాండ్.. వర్షం కారణంగా భారత్‌తో జరగాల్సిన వామప్ మ్యాచ్ ఆడలేకపోయింది. అంతకుముందు పాకిస్థాన్, బంగ్లాదేశ్‌తో జరిగిన ట్రై సిరీస్‌లో ఓటమిపాలైంది. మరోవైపు ఆస్ట్రేలియా పటిష్టంగా కనిపిస్తోంది.

స్మిత్ ఔట్..
ఆస్ట్రేలియా కాంబినేషన్‌లో స్మిత్‌కు చోటు దక్కడం కష్టంగా మారింది. అతను బెంచ్‌కే పరిమితం కానున్నాడు. అతనికి బదులు స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ ఫస్ట్ డౌన్‌లో బరిలోకి దిగనున్నాడు. ఫించ్, వార్నర్ ఇన్నింగ్స్ ప్రారంభించనుండగా.. గ్లేన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినీస్, టీమ్ డేవిడ్ మిడిలార్డర్ బాధ్యతలు చూసుకోనున్నారు. మాథ్యూ వేడ్ ఫినిషర్ రోల్ పోషించనుండగా.. ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హజెల్ వుడ్ బౌలింగ్ బాధ్యతలు మోయనున్నారు. ఏకైక స్పిన్నర్‌గా ఆడమ్ జంపా ఆడనున్నాడు. అతనికి తోడుగా గ్లేన్ మ్యాక్స్‌వెల్ స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నాడు.

మార్టిన్ గప్టిల్ డౌట్..
గత టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ను ఫైనల్‌కు చేర్చిన డారిల్ మిచెల్ గాయంతో జట్టుకు దూరమయ్యాడు. దాంతో డేవాన్ కాన్వే ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. అతనికి తోడుగా ఫిన్ అలెన్, మార్టిన్ గప్టిల్‌లో ఒకరు అవకాశం దక్కించుకోనున్నారు. పిచ్ కండిషన్స్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకోనున్నారు. ట్రై సిరీస్‌లో సత్తా చాటిన మైకేల్ బ్రెస్ వెల్‌కు కూడా అవకాశం దక్కనుంది. ఫెర్గూసన్, ఆడమ్ మిల్నేలో ఒకరు బరిలోకి దిగనున్నారు. మిగతా జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు.

తుది జట్లు(అంచనా)
ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, టీమ్ డేవిడ్, మాథ్యూ వేడ్, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హజెల్ వుడ్
న్యూజిలాండ్: డేవాన్ కాన్వే(కీపర్), ఫిన్ అలెన్/మార్టిన్ గప్టిల్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), గ్లేన్ ఫిలిప్స్, మైకేల్ బ్రేస్‌వెల్/మార్క్ చాప్‌మప్, జిమ్మీ నీషమ్, మిచెల్ సాంట్నర్, టీమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్, లాకీ ఫెర్గూసన్/ఆడమ్ మిల్నే, ఇష్ సోధీ


Click it and Unblock the Notifications












