Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Australia Playing XI: వ్యూహాత్మక మార్పు.. భారత్‌తో ఫైనల్ ఆడే ఆస్ట్రేలియా తుది జట్టు ఇదే!

Australia Playing XI vs India for World Cup 2023 Final: వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ సమరానికి సమయం ఆసన్నమైంది. మరికొద్ది గంటల్లో ఈ మెగా ఫైనల్‌కు తెరలేవనుంది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగే టైటిల్ ఫైట్‌లో ఆతిథ్య భారత్, ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.

ఓటమెరుగని జట్టుగా ఫైనల్ చేరిన రోహిత్ సేన అదే జోరులో ఆసీస్‌ను ఓడించి టైటిల్ అందుకోవాలని భావిస్తోంది. మరోవైపు తొలి రెండు పరాజయాల తర్వాత అనూహ్యంగా పుంజుకొని వరుసగా 8 విజయాలతో ఫైనల్‌కు దూసుకొచ్చిన ఆసీస్.. భారత్‌ను మట్టికరిపించి ఆరోసారి టైటిల్ ముద్దాడాలని ఉవ్విళ్లూరుతోంది.

Australia Playing XI vs India for World Cup 2023 Final: Labuschagne OUT and Marcus Stoinis IN

ఇరు జట్లు ఫామ్, బల బలాల పరంగా సూపర్ ఫామ్‌లో ఉన్నాయి. సొంతగడ్డపై సొంత అభిమానుల మధ్య ఈ మ్యాచ్ జరగనుండటం భారత్‌కు కలిసొచ్చే అంశం కాగా.. మెగా టోర్నీలో భారత్‌పై మెరుగైన రికార్డు ఉండటం ఆసీస్‌కు కలిసిరానుంది. ఇప్పటికే ఇరు జట్లు ఈ మ్యాచ్ కోసం అన్ని విధాలుగా సిద్దమయ్యాయి.

ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తుది జట్టులో వ్యూహాత్మక మార్పు చేసే అవకాశం ఉంది. మిడిలార్డర్ బ్యాటర్ మార్నస్ లబుషేన్‌ను తప్పించి అతని స్థానంలో పేస్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినీస్ తీసుకునే అవకాశం ఉంది. మార్నస్ లబుషేన్ స్పిన్ బౌలింగ్‌ను ఆడలేకపోవడం.. సౌతాఫ్రికాతో సెమీస్ మ్యాచ్‌లో విఫలమైన నేపథ్యంలో అతనిపై వేటు వేసేందుకు ఆసీస్ మేనేజ్‌మెంట్ సిద్దమైనట్లు తెలుస్తోంది.

మరోవైపు మార్కస్ స్టోయినీస్‌కు భారత కండిషన్స్‌పై అవగాహన ఉండటం.. ఆసీస్‌కు ఎక్స్‌ట్రా పేస్ బౌలింగ్ ఆప్షన్ లభించనుండటం అతనికి కలిసొచ్చే అంశాలు. ముఖ్యంగా భారత పిచ్‌లకు తగ్గట్లు స్లో బాల్స్, కట్టర్స్ వేయడంలో స్టోయినీస్ దిట్ట. బ్యాటింగ్‌లో విధ్వంసకరంగా ఆడగలడు. ఐపీఎల్ ఆడిన అనుభవం ఉండటం కూడా అతనికి అడ్వాంటేజ్.

ఈ ఒక్క మార్పు తప్పా తుది జట్టులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోకపోవచ్చు. ఓపెనర్లుగా డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్ బరిలోకి దిగనుండగా.. మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, జోష్ ఇంగ్లీష్ మిడిలార్డర్ బాధ్యతలు పంచుకోనున్నారు. లోయరార్డర్‌లో స్టోయినీస్, స్టార్క్, ప్యాట్ కమిన్స్ ఆడనున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా ఆడమ్ జంపా బరిలోకి దిగనుండగా.. ప్రధాన పేసర్‌గా జోష్ హజెల్ వుడ్ ఆడనున్నాడు.

ఆస్ట్రేలియా తుది జట్టు(అంచనా): డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, జోష్ ఇంగ్లీస్(కీపర్), మార్కస్ స్టోయినీస్, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, ఆడమ్ జంపా, జోష్ హజెల్ వుడ్

Story first published: Saturday, November 18, 2023, 18:36 [IST]
Other articles published on Nov 18, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+