Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Australia Playing XI: ఇండోర్ టెస్ట్‌లో ఇండియాను ఓడించే ఆసీస్ టీమ్ ఇదే!

 Australia Playing XI vs India for Indore test: Steve Smith to lead team in Pat Cummins absence

ఇండోర్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వరుస పరాజయాలతో చతికిలపడిన ఆస్ట్రేలియా మరో కీలక పోరుకు సిద్దమైంది. ఇండోర్ వేదికగా బుధవారం నుంచి ప్రారంభం కానున్న మూడో టెస్ట్‌లో భారత్‌తో తలపడనుంది. ఇప్పటికే ఇండోర్ చేరి ప్రాక్టీస్ మొదలుపెట్టిన ఆసీస్.. విజయమే లక్ష్యంగా సిద్దమవుతోంది.
వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ పాయింట్స్ టేబుల్‌తో పాటు టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం పదిలంగా ఉండాలంటే ఆసీస్ ఈ మ్యాచ్ గెలవడం చాలా ముఖ్యం. ఈ క్రమంలోనే ఆసీస్ తమ బలహీనతలపై ఫోకస్ పెట్టింది. సోమవారం రోలర్లు, రేకు డబ్బాల సాయంతో వినూత్నంగా ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేసింది. క్యాచ్ డ్రాప్స్‌తో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన ఆసీస్.. ఆ బలహీతను అధిగమించే ప్రయత్నం చేస్తోంది.

కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్..

కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్..

ఇండోర్ వికెట్ కాస్త బౌన్సీగా ఉండటంతో పాటు పేస్‌కు అనుకూలిస్తుందనే నేపథ్యంలో ఈ మ్యాచ్‌‌లో గెలిచి తీరాలనే పట్టుదలతో సిద్దమవుతోంది.

అయితే ఈ మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియాను గాయాల బెడదతో పాటు అనూహ్య పరిస్థితు ఇబ్బంది పెడుతున్నాయి. డేవిడ్ వార్నర్, జోష్ హజెల్ వుడ్ గాయాలతో సిరీస్ మొత్తానికి దూరం కాగా.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అత్యవసర పరిస్థితులతో స్వదేశం పయనమయ్యాడు. అతను చివరి రెండు టెస్ట్‌లతో పాటు వన్డే సిరీస్ ఆడటంపై కూడా సందేహాలు నెలకొన్నాయి. ఈ ముగ్గురు దూరమైనా.. మిచెల్ స్టార్క్, కామెరూన్ గ్రీన్ గాయాల నుంచి కోలుకొని జట్టులోకి వచ్చారు. ప్యాట్ కమిన్స్ గైర్హాజరీలో స్టీవ్ స్మిత్ జట్టును నడిపించనున్నాడు.

కామెరూన్ గ్రీన్, స్టార్క్ రెడీ..

కామెరూన్ గ్రీన్, స్టార్క్ రెడీ..

తొలి రెండు టెస్ట్‌లకు బరిలోకి దిగిన ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడం.. కొత్తగా ఇద్దరు ఆటగాళ్లు జట్టులోకి రావడంతో తుది జట్టు ఎంపిక స్మిత్‌కు తలనొప్పిగా మారింది. ఇద్దరు పేసర్లతో వెళ్లాలా? లేక ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలా? అనేది తేల్చుకోలేకపోతున్నాడు. అయితే బ్యాటింగ్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ అందుబాటులోకి రావడం స్మిత్‌కు కలిసిరానుంది. గ్రీన్ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో సత్తా చాటగలిగితే ఆసీస్‌కు తిరుగుండదు. టీమ్ కాంబినేషన్ కూడా సెట్ అవుతోంది. కమిన్స్ స్థానంలో పేసర్‌గా మిచెల్ స్టార్క్ ఆడనుండగా.. మ్యాట్ రేన్ షా స్థానంలో గ్రీన్ తుది జట్టులోకి రానున్నాడు.

 వార్నర్ స్థానంలో ట్రావిస్ హెడ్..

వార్నర్ స్థానంలో ట్రావిస్ హెడ్..

డేవిడ్ వార్నర్ గైర్హాజరీలో ట్రావిస్ హెడ్.. ఉస్మాన్ ఖవాజాతో కలిసి ఓపెనింగ్ చేయనున్నాడు. ఈ ఇద్దరూ రెండో టెస్ట్‌లో పర్వాలేదనిపించినా.. భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేకపోయారు. ఫస్ట్ డౌన్‌లో మార్నస్ లబుషేన్, నాలుగో స్థానంలో కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఆడనున్నారు. ఈ ఇద్దరూ ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఒక్కటి కూడా ఆడలేదు. ఐదో స్థానంలో కామెరూన్ గ్రీన్ బరిలోకి దిగనుండగా... మ్యాట్ రేన్‌షా బెంచ్‌కే పరిమితం కానున్నాడు. ఆరో స్థానంలో పీటర్ హ్యాండ్‌స్కోంబ్, ఏడో స్థానంలో కీపర్ అలెక్స్ క్యారీ బ్యాటింగ్ చేయనున్నారు.

స్టార్క్ సారథ్యంలో బౌలింగ్ విభాగం..

స్టార్క్ సారథ్యంలో బౌలింగ్ విభాగం..

మిచెల్ స్టార్క్‌తో కలిసి నాథన్ లయన్, టాడ్ ముర్ఫీ, మాథ్యూ కుహ్నెమన్ బౌలింగ్ బాధ్యతలు పంచుకునే అవకాశం ఉంది. ఈ నలుగురికి ఆల్‌రౌండర్లు హ్యాండ్‌స్కోంబ్, కామెరూన్ గ్రీన్ సహాయం అందివ్వనున్నారు. ఇండోర్ పిచ్ చూసిన తర్వాత ధానికి తగ్గట్లు టీమ్ కాంబినేషన్‌పై తుది నిర్ణయం తీసుకోనున్నారు. వికెట్ బౌన్సీగా ఉండటంతో పాటు పేస్‌కు అనుకూలిస్తే ఎక్స్‌ట్రా పేసర్ జట్టులోకి రానున్నాడు. లాన్స్ మొర్రీస్ అరంగేట్ర చేసే చాన్స్ ఉంది. ఎక్స్‌ట్రా బ్యాటర్‌‌తో ఆడాలనుకుంటే మ్యాట్ రేన్‌షా తన స్థానాన్ని నిలబెట్టుకుంటాడు.

ఆసీస్ తుది జట్టు(అంచనా)

ఆసీస్ తుది జట్టు(అంచనా)

ఉస్మాన్ ఖవాజా, ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్(కెప్టెన్), కామెరూన్ గ్రీన్, పీటర్ హ్యాండ్‌స్కోంబ్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, నాథన్ లయన్, టాడ్ ముర్ఫీ, మాథ్యూ కుహ్నెమన్/లాన్స్ మొర్రీస్

Story first published: Monday, February 27, 2023, 18:32 [IST]
Other articles published on Feb 27, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+