Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Australia Playing XI: కెప్టెన్‌గా స్మిత్.. స్టార్క్, గ్రీన్ రీఎంట్రీ! భారత్‌తో మూడో టెస్ట్ ఆడే ఆసీస్ జట్టు ఇదే

Australia Playing XI vs India for 3rd test: Smith to captain and Starc, Cameron Green re-entry

ఇండోర్: భారత్‌తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడి చతికిల పడిన ఆస్ట్రేలియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. ఇండోర్ వేదికగా బుధవారం(మార్చి1) నుంచి ప్రారంభం కానున్న మూడో టెస్ట్‌లో అమీతుమీ తేల్చుకోనుంది. ఆదివారమే ఇండోర్ పయనమైన ఆసీస్ టీమ్.. విజయమే లక్ష్యంగా సన్నదమవుతోంది. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో, టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం పదిలంగా ఉండాలంటే ఆసీస్ ఈ మ్యాచ్ గెలవడం తప్పనిసరి. ఈ క్రమంలోనే ఆసీస్.. విశ్రాంతి లేకుండా నెట్స్‌లో చెమటోడ్చింది. ఢిల్లీ టెస్ట్ మూడు రోజుల్లోనే ముగియడంతో భారత ఆటగాళ్లు వారం రోజులు విశ్రాంతి తీసుకోగా.. ఆసీస్ ప్లేయర్లు మాత్రం ఢిల్లీలో గంటలు తరబడి ప్రాక్టీస్ చేశారు.

స్మిత్ సారథ్యంలో...

స్మిత్ సారథ్యంలో...

ముఖ్యంగా భారత స్పిన్ ద్వయాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంపై ఫోకస్ పెట్టారు. అయితే మూడో టెస్ట్‌కు ముందు ఆస్ట్రేలియా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటుంది. తల్లి అనారోగ్యానికి గురై రోజులు లెక్కపెడుతుండటంతో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ హుటాహుటిన ఆసీస్‌కు బయల్దేరాడు. మళ్లీ భారత్‌కు తిరిగిరాలేనని చెప్పాడు. మరోవైపు డేవిడ్ వార్నర్, జోష్ హజెల్ వుడ్ గాయాలతో సిరీస్ నుంచి తప్పుకున్నారు. అయితే మిచెల్ స్టార్క్, కామెరూన్ గ్రీన్ అందుబాటులోకి రావడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. కమిన్స్ గైర్హాజరీలో స్టీవ్ స్మిత్ జట్టును నడిపించనున్నాడు.

గ్రీన్, స్టార్క్ రీఎంట్రీ..

గ్రీన్, స్టార్క్ రీఎంట్రీ..

కీలక ఆటగాళ్ల గైర్హాజరీ.. గాయపడ్డ ఆటగాళ్లు జట్టులోకి రావడంతో టీమ్ కాంబినేషన్ స్మిత్‌కు తలనొప్పిగా మారింది. తొలి టెస్ట్ మాదిరి ఇద్దరు పేసర్లతో వెళ్లాలా? లేక రెండో టెస్ట్‌లా ఒక్క పేసర్‌తో బరిలోకి దిగాలా? అనేది తేల్చుకోలేకపోతున్నారు. అయితే బ్యాటింగ్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ అందుబాటులోకి రావడం ఆసీస్‌కు కలిసొచ్చే అంశం. గ్రీన్ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో సత్తా చాటగలిగితే ఆసీస్‌కు తిరుగుండదు. టీమ్ కాంబినేషన్ కూడా సెట్ అవుతోంది. కమిన్స్ స్థానంలో పేసర్‌గా మిచెల్ స్టార్క్ ఆడనుండగా.. మ్యాట్ రేన్ షా స్థానంలో గ్రీన్ ఆడనున్నాడు.

ఓపెనర్లుగా ఖవాజా, ట్రావిస్ హెడ్..

ఓపెనర్లుగా ఖవాజా, ట్రావిస్ హెడ్..

డేవిడ్ వార్నర్ గైర్హాజరీలో ట్రావిస్ హెడ్.. ఉస్మాన్ ఖవాజాతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. ఈ ఇద్దరూ రెండో టెస్ట్‌లో పర్వాలేదనిపించారు. ఫస్ట్ డౌన్‌లో మార్నస్ లబుషేన్, నాలుగో స్థానంలో కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఆడనున్నారు. ఈ ఇద్దరూ ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ అయితే ఆడలేదు. ఐదో స్థానంలో కామెరూన్ గ్రీన్ బరిలోకి దిగుతాడు. దాంతో మ్యాట్ రేన్‌షా బెంచ్‌కే పరిమితమవుతాడు. ఆరో స్థానంలో పీటర్ హ్యాండ్‌స్కోంబ్, ఏడో స్థానంలో కీపర్ అలెక్స్ క్యారీ బరిలోకి దిగుతారు.

స్టార్క్ సారథ్యంలో బౌలింగ్ విభాగం..

స్టార్క్ సారథ్యంలో బౌలింగ్ విభాగం..

స్టార్క్, నాథన్ లయన్, టాడ్ ముర్ఫీ, మాథ్యూ కుహ్నెమన్ బౌలింగ్ బాధ్యతలు పంచుకుంటారు. వీరికి హ్యాండ్‌స్కోంబ్, కామెరూన్ గ్రీన్ సహాయం అందివ్వనున్నారు. ఇండోర్ పిచ్ చూసిన తర్వాత బౌలింగ్ కాంబినేషన్‌ను ఎంపిక చేయనున్నారు. పేస్‌కు కాస్త అనుకూలంగా ఉంటే మాథ్యూ కుహ్నెమన్ స్థానంలో లాన్స్ మొర్రీస్ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. లేదంటే ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతారు.

ఆసీస్ తుది జట్టు(అంచనా)

ఉస్మాన్ ఖవాజా, ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్(కెప్టెన్), కామెరూన్ గ్రీన్, పీటర్ హ్యాండ్‌స్కోంబ్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, నాథన్ లయన్, టాడ్ ముర్ఫీ, మాథ్యూ కుహ్నెమన్/లాన్స్ మొర్రీస్

Story first published: Sunday, February 26, 2023, 12:11 [IST]
Other articles published on Feb 26, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+