Australia Playing XI: కామెరూన్ గ్రీన్ ఔట్.. భారత్‌తో తొలి టెస్ట్ ఆడే ఆస్ట్రేలియా జట్టు ఇదే!

హైదరాబాద్: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి రంగం సిద్దమైంది. గురువారం నుంచి నాగ్‌పూర్ వేదికగా జరిగే తొలి టెస్ట్‌తో ఈ నాలుగు టెస్ట్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇరు జట్లు తమ సన్నాహకాలను పూర్తి చేసుకున్నాయి. 2004 నుంచి సొంతగడ్డపై టీమిండియాను ఓడించలేకపోతున్న ఆస్ట్రేలియా.. ఈసారి ఆ ముచ్చట తీర్చుకోవాలనుకుంటుంది. ఈ క్రమంలోనే భారత కండిషన్స్‌కు తగ్గట్లు స్పిన్ బౌలింగ్‌ను సమర్థవంతం ఎదుర్కొనేందుకు బెంగళూరు సమీపంలో ప్రాక్టీస్ క్యాంప్‌లో చెమటోడ్చింది. వారం రోజుల శిక్షణ అనంతరం సోమవారమే నాగ్‌పూర్ చేరుకుంది. అయితే టీమ్ కాంబినేషన్ ఇప్పుడు ఆ జట్టుకు సమస్యగా మారింది.

కామెరూన్ గ్రీన్ దూరం..
వేలి గాయానికి గురైన కామెరూన్ గ్రీన్ తొలి టెస్ట్ ఆడటం లేదని ఆ జట్టు సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఇప్పటికే స్పష్టం చేశాడు. దాంతో తుది జట్టు ఎంపిక ఆసీస్‌కు సవాల్‌గా మారింది. ముఖ్యంగా మూడు సమస్యలు ఆ జట్టును వేదిస్తున్నాయి. గాయంతో దూరమైన కామెరూన్ గ్రీన్ స్థానంలో మాథ్యూ రేన్‌షాను ఆడించాలా? లేక పీటర్ హ్యాండ్‌స్కోంబ్‌కు అవకాశం ఇవ్వాలా? అనేది ఆసీస్ మేనేజ్‌మెంట్ తేల్చుకోలేకపోతుంది. ఇక ఎడమ పాదం గాయంతో జోష్ హజెల్ వుడ్ కూడా తొలి టెస్ట్ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. ఒకవేళ అతను దూరమైతే.. అతని స్థానంలో లాన్స్ మోరీస్, స్కాట్ బోలాండ్‌లో ఎవర్నీ ఆడించాలనేది కూడా తేల్చుకోలేకపోతుంది. టర్నింగ్ ట్రాక్‌లపై స్పెషలిస్ట్ స్పిన్నర్ నాథన్ లియోన్‌కు జతగా ఎవర్నీ ఎంపిక చేయాలనేది కూడా ఆసీస్‌మేనేజ్‌మెంట్‌కు సమస్యగా మారింది.

ఓపెనర్లుగా ఖాజా, వార్నర్..
ఓపెనర్లుగా ఉస్మాన్ ఖవాజా, డేవిడ్ వార్నర్‌లు బరిలోకి దిగనున్నారు. ఈ ఇద్దరూ సొంతగడ్డపై అద్భుత ప్రదర్శన కనబర్చారు. అదే జోరును భారత్‌లోనూ కొనసాగించాలనుకుంటున్నారు. భారత పరిస్థితులపై వార్నర్‌కు మంచి అనుభవం ఉంది. మిడిలార్డర్‌లో మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మీత్ ఆడనుండగా.. కీపర్‌గా అలెక్స్ క్యారీ బరిలోకి దిగనున్నాడు. స్మిత్ సూపర్ ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. గాయంతో దూరమైన కామెరూన్ గ్రీన్ స్థానంలో పీటర్ హ్యాండ్‌స్కోంబ్ ఆడే అవకాశం ఉంది. గ్రీన్ గైర్హాజరీతో ఆసీస్‌కు ఓ బౌలింగ్ ఆప్షన్ తగ్గనుంది.

అనామక ప్లేయర్‌కు చాన్స్..
జోష్ హజెల్ వుడ్ గాయంపై క్లారిటీ లేకపోయినప్పటికే దూరమైతే స్కాట్ బోలాండ్ జట్టులోకి రానున్నాడు. అతనికి అన్‌క్యాప్ ప్లేయర్ లాన్స్ మోరీస్ పోటీ ఎదురవ్వనుంది. నాథన్ లియోన్‌కు అండగా అష్టన్ అగర్, అనామక ప్లేయర్ టోడ్ ముర్ఫీ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఆసీస్ సైతం ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. గ్రీన్ స్థానంలో ఆల్‌రౌండర్ కావాలనుకుంటే ట్రావిడ్ హెడ్ జట్టులోకి వస్తాడు.

ఆస్ట్రేలియా తుది జట్టు(అంచనా)
ఉస్మాన్ ఖవాజా, డేవిడ్ వార్నర్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, అలెక్స్ క్యారీ, ట్రావిస్ హెడ్, అష్టన్ అగర్, నాథన్ లియోన్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), జోష్ హజెల్ వుడ్, టోడ్ ముర్ఫీ
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications