Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Australia Playing XI for WTC Final: స్పిన్నర్ ఒక్కడే! భారత్‌తో ఆడే ఆసీస్ తుది జట్టు ఇదే!

హైదరాబాద్: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు రంగం సిద్దమైంది. లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ఈ మెగా ఫైనల్‌కు మరో రెండు రోజుల్లో తెరలేవనుంది. బుధవారం(జూన్ 7) నుంచి ఆదివారం వరకు జరిగే ఈ టైటిల్ ఫైట్‌కు సోమవారాన్ని రిజర్వ్ డేగా ప్రకటించారు.

ఇప్పటికే ఇరు జట్లు లండన్ చేరి ముమ్మరంగా సాధన చేస్తున్నాయి. గత రెండేళ్లుగా సాగిన ఈ టోర్నీలో అసాధారణ ప్రదర్శనతో ఫైనల్ చేరిన ఈ రెండు జట్లు విశ్వవిజేతగా నిలిచేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. టీమ్ కాంబినేషన్‌తో పాటు పకడ్బందీ ప్రణాళికలపై స్పెషల్ ఫోకస్ పెట్టాయి. ఇక ఈ ఫైనల్ మ్యాచ్‌కు ముందే ఆస్ట్రేలియాకు గట్టి షాక్ తగిలింది.

Australia Playing XI for WTC Final

స్టార్ పేసర్ జోష్ హజెల్ వుడ్ గాయంతో ఆసీస్‌కు వెనుదిరిగాడు. అతని స్థానంలో స్కాట్ బోలాండ్ ఆడే అవకాశం ఉంది. అయితే అతనికి మైకేల్ నెసర్‌తో పోటీ నెలకొంది. హజెల్ వుడ్ మినహా ఆసీస్‌కు ఎలాంటి గాయల బెడద లేదు. ఐపీఎల్ 2023 సీజన్‌లో సూపర్ ఫామ్ కనబర్చిన కామెరూన్ గ్రీన్.. అదే జోరును కొనసాగించాలనుకుంటున్నాడు.

మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేయనున్న గ్రీన్.. బౌలింగ్ చేయనుండటం ఆసీస్‌కు కలిసొచ్చే అంశం. ఆసీస్ ఏకైక స్పిన్నర్‌తో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఓ పేస్ ఆల్‌రౌండర్‌తో పాటు ముగ్గురు స్పెషలిస్ట్ పేసర్లు, ఓ స్పిన్నర్ కాంబినేషన్‌తో ఆడనుంది.

ఓపెనర్లుగా ఉస్మాన్ ఖవాజా, డేవిడ్ వార్నర్ ఆడనున్నారు. టెస్ట్ ఫార్మాట్‌లో వార్నర్‌కు ఇది చివరి అవకాశంగా భావించవచ్చు. ఈ మ్యాచ్‌లో రాణిస్తేనే అతను ఇంగ్లండ్‌తో జరిగే యాషెస్ సిరీస్‌లో కొనసాగనున్నాడు. ఫస్ట్ డౌన్‌లో మార్నస్ లబుషేన్ ఆడనుండగా.. నాలుగో స్థానంలో స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ చేయనున్నాడు.

ఈ ఇద్దరూ ఇప్పటికే కౌంటీ క్రికెట్ ఆడి.. ఇక్కడి పరిస్థితులపై మంచి పట్టుసాధించారు. నాలుగో స్థానంలో ట్రావిస్ హెడ్ బ్యాటింగ్ చేయనుండగా.. ఆరో స్థానంలో కామెరూన్ గ్రీన్ బరిలోకి దిగనున్నాడు. ఏడో స్థానంలో వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ బ్యాటింగ్ చేయనున్నాడు. ఇక ఏడో స్థానం వరకు ఆసీస్‌కు భీకరమైన బ్యాటింగ్ లైనప్ ఉంది.

ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, స్కాట్ బోలాండ్ పేస్ బాధ్యతలు పంచుకోనుండగా.. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా నాథన్ లయన్ బరిలోకి దిగనున్నాడు. స్వింగ్, పేస్‌కు అనుకూలంగా ఉండే ఓవల్ మైదానంలో కమిన్స్, స్టార్క్ కీలకం కానున్నారు.

Australia Playing XI for WTC Final

ఆస్ట్రేలియా తుది జట్టు(అంచనా)
డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, స్కాట్ బోలాండ్, నాథన్ లయన్.

Story first published: Monday, June 5, 2023, 17:51 [IST]
Other articles published on Jun 5, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+