కోహ్లీ కాదు.. టీమిండియాలో మాటలతో కవ్వించేది అతనే: ఆస్ట్రేలియా క్రికెటర్లు
టీమిండియాలో బెస్ట్ స్లెడ్జర్ ఎవరా? అనే ప్రశ్నకు ఆస్ట్రేలియా ఆటగాళ్లంతా వికెట్ కీపర్ రిషభ్ పంత్ పేరు సూచించారు. టీమిండియాలతో మాటలతో కవ్వించే ఆటగాడు రిషభ్ పంత్ మాత్రమేనని స్పష్టం చేశారు. క్రికెట్‌లో ఆటగాళ్ల మధ్య మాటల యుద్దం జరగడం సాధారణమే. కొన్నిసార్లు ఇది హద్దులు ధాటి తారా స్థాయికి చేరుతోంది.
అయితే క్రికెట్ ప్రంపచానికి స్లెడ్జింగ్ పరిచయం చేసిందే ఆస్ట్రేలియా. సూటి పోటీ మాటలతో ప్రత్యర్థి బ్యాటర్లను కవ్వించడం.. నిర్లక్ష్యపు షాట్స్ ఆడేలా మాటలతో రెచ్చగొట్టి.. అందుకనుగుణంగా బంతులేసి వికెట్లు సాధించడం వారి స్లెడ్జింగ్ స్పెషాలిటీ. బ్యాటర్ల ఏకాగ్రతను దెబ్బతీయడానికి ఆస్ట్రేలియా ఆటగాళ్లు నోటికి పనిచెప్పేవారు.

స్లెడ్జింగ్‌ను తిప్పి కొడుతూ..
ఇక ఆసీస్ స్లెడ్జింగ్‌ను తిప్పికొడుతూ.. వారి విధ్యనే వారిపై ప్రయోగించి టీమిండియా ఫలితం రాబట్టింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా మాటకు మాట బదులిచ్చి.. తామేం తక్కువ కాదని చాటి చెప్పింది. 2014-15 బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో కోహ్లీ దూకుడు కనబరిస్తే.. ఆ తర్వాత పంత్ తన నోటికి పనిచెప్పాడు.
ఈ సిరీస్‌ల సందర్భంగా ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య కవ్వింపులు, మాటల యుద్దాలు జరిగాయి. గతంలో ఈ కవ్వింపులు తారా స్థాయికి చేరి గొడవలు జరిగినా.. గత ఆసీస్ పర్యటనలో మాత్రం ఇరు జట్ల మధ్య సరదా స్లెడ్జింగ్ జరిగింది. ఐపీఎల్ ప్రభావమో ఏమో కానీ ఆసీస్, భారత ఆటగాళ్ల మధ్య మంచి స్నేహం, చనువు ఏర్పడింది. దాంతో స్లెడ్జింగ్ కూడా అభిమానుల నవ్వులు పూయిస్తోంది.
"Main (sledging) pyaar se karta hu!" 🤭
— Star Sports (@StarSportsIndia) October 4, 2024
Never change, @RishabhPant17 😂 Once again, wishing you a Pant-astic year ahead! 🥳
See him soon in the #ToughestRivalry! #AUSvINDOnStar, starts NOV 22! pic.twitter.com/TIbRLQoTH3
సరదా కోసమే స్లెడ్జింగ్..
నవంబర్‌లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం భారత్.. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అక్కడ ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన కార్యక్రమంలో.. ఆస్ట్రేలియా ఆటగాళ్లు ట్రావిస్ హెడ్, లబుషేన్, ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్, ప్యాట్ కమిన్స్, హేజిల్ వుడ్.. రిషభ్ పంత్ బెస్ట్ స్లెడ్జర్ అని తెలిపారు.
వికెట్ల వెనుకాల ఉండి అతను ఏదో మాట్లాడుతూ ఉంటాడని, అది ఏంటో తమకు అర్థం కాదని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను స్టార్ స్పోర్ట్స్ సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ వీడియోలో రిషభ్ పంత్ కూడా మాట్లాడాడు. తాను సరదా కోసమే స్లెడ్జ్ చేస్తానని, మరే ఉద్దేశంతో కాదని తెలిపాడు.
టీమ్ పైన్ X పంత్..
2018-19 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రిషభ్ పంత్.. అప్పటి ఆస్ట్రేలియా కెప్టెన్ టీమ్ పైన్‌ను ఓ ఆట ఆడుకున్నాడు. అతను బ్యాటింగ్ చేస్తుండగా.. తాత్కలిక కెప్టెన్ అంటూ సెటైర్లు పేల్చాడు. టీమ్ పైన్ కూడా బేబీ సిట్టర్ అంటూ.. పంత్‌కు కౌంటరిచ్చాడు. అప్పట్లో ఈ స్లెడ్జింగ్ ఎపిసోడ్ నెట్టింట హల్‌చల్ చేసింది. ఆ తర్వాత ఈ ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications