For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బీసీసీఐకి ఎదురుదెబ్బ.. ఐపీఎల్ 2021 సెకండాఫ్‌‌కు ఆ దేశ ఆటగాళ్లు దూరం!

Australia players likely to miss remainder of IPL 2021
IPL 2021 : Australia Players Likely To Miss సిరీస్‌లనే రద్దు చేయించగల BCCI || Oneindia Telugu

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2021 సీజన్ సెకండాఫ్ ఆరంభానికి ముందే భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి గట్టిషాక్ తగిలింది. కరోనాతో అర్దంతరంగా ఆగిపోయిన లీగ్‌ను యూఏఈ వేదికగా పూర్తి చేయాలని బీసీసీఐ ప్రణాళికలు రచిస్తుంటే..మరోవైపు విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉండటంపై సందిగ్దత నెలకొంది.

ముఖ్యంగా ఈ సెకండాఫ్ లీగ్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు పాల్గొనడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఆగస్టులో ఆస్ట్రేలియా జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో ఇరు జట్లు ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) చైర్మన్ అక్రమ్ ఖాన్ ధృవీకరించాడు.

తలుచుకుంటే సిరీసే రద్దు..

తలుచుకుంటే సిరీసే రద్దు..

ఈ బిజీ షెడ్యూల్ నేపథ్యంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఐపీఎల్ 2021 సీజన్‌లో పాల్గొనడం అనుమానంగా మారింది. ఇదే జరిగితే లీగ్‌‌కు తీవ్ర నష్టం. విదేశీ ఆటగాళ్ల కోటాలో ఆస్ట్రేలియా క్రికెటర్ల పాత్రే ఎక్కువ. అయితే ఇది బీసీసీఐ పెద్ద సమస్యేం కాదని విశ్లేషకులు అంటున్నారు. అవసరమైతే బీసీసీఐ బంగ్లాదేశ్-ఆస్ట్రేలియా సిరీస్‌లనే రద్దు చేయించగలదని అభిప్రాయపడుతున్నారు.

పైగా టీ20 ప్రపంచకప్ ముందు సన్నాహకంగా బంగ్లాదేశ్‌తో సిరీస్ కంటే తమ ఆటగాళ్లు ఐపీఎల్ ఆడటమే ముఖ్యమని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తోందంటున్నారు. ఒక్క సీఏనే కాకుండా ఇతర క్రికెట్ బోర్డులు కూడా ఐపీఎల్‌కే ప్రాధాన్యమిస్తాయంటున్నారు.

మూడు వారాల్లో లీగ్ ఖేల్ ఖతమ్..

మూడు వారాల్లో లీగ్ ఖేల్ ఖతమ్..

ఇక ఖాళీగా ఉన్న సెప్టెంబర్, అక్టోబర్‌ నెలల్లో మూడు వారాల్లో వేగంగా లీగ్‌ పూర్తి చేయాలని బీసీసీఐ కసరత్తులు చేస్తోంది. 'సెప్టెంబర్‌ 18 లేదంటే 19న ఈ సీజన్‌ పునఃప్రారంభం అవుతుంది. పది రోజులు రెండేసి మ్యాచ్‌ల్ని, ఏడు రోజులు ఒక్కో మ్యాచ్‌ నిర్వహిస్తాం. యూఏఈలో రెండు మూడు వేదికల్లో కాకుండా కేవలం దుబాయ్‌లోనే మ్యాచ్‌లను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నాం' అని బోర్డు సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. అక్టోబర్‌ 9 లేదంటే 10వ తేదీన జరిగే ఫైనల్‌తో 14వ సీజన్‌ను ముగిస్తామని ఆయన అన్నారు. ఈ వారాంతంలో తుది షెడ్యూల్‌ను ప్రకటిస్తామన్నారు.

సెప్టెంబర్ 15నే..

సెప్టెంబర్ 15నే..

ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లండ్‌ పర్యటన కోసం ముంబైలో హార్డ్‌ క్వారంటైన్‌లో ఉంది. అక్కడ న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌తో పాటు ఆతిథ్య దేశంలో ఐదు టెస్టుల సిరీస్‌ ఆడుతుంది. సెప్టెంబర్‌ 14న ఆఖరి టెస్టు ముగిసిన మరుసటి రోజే యూఏఈకి బయల్దేరుతుంది. ప్రత్యేక విమానంలో బబుల్‌ నుంచి బబుల్‌కు బదిలీ అవుతుంది. కాబట్టి మళ్లీ ప్రత్యేకించి క్వారంటైన్‌ కావాల్సిన అవసరమే ఉండదని బీసీసీఐ భావిస్తోంది. ఈ మేరకు ఇదివరకే ఫ్రాంచైజీలకు సమాచారం ఇచ్చింది.

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌ రద్దు..

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌ రద్దు..

భారత్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌కు సన్నాహకంగా సౌతాఫ్రికా జట్టుతో ఆడాలనుకున్న టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను బోర్డు రద్దు చేసింది. ఐపీఎల్, మెగా ఈవెంట్‌కు మధ్య సమయం లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు తెలిపింది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరగాల్సిన రెండు టెస్టుల సిరీస్‌ను వాయిదా వేసింది. అందుబాటులో ఉన్న తేదీలను బట్టి దీన్ని రీషెడ్యూల్‌ చేయనున్నట్లు బోర్డు వెల్లడించింది. అయితే లీగ్ నిర్వహణపై మే 29న జరిగే బీసీసీఐ సర్వసభ్య సమావేశంలో క్లారిటీ రానుంది.

Story first published: Wednesday, May 26, 2021, 17:21 [IST]
Other articles published on May 26, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+