Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అలా అనుకుంటే పొరపాటే.. ఐసీసీని హెచ్చరించిన డేవిడ్ వార్నర్

Australia Opener David Warner against saliva-ban for shining the ball
David Warner Supports Use Of Saliva To Shine Ball | Oneindia Telugu

సిడ్నీ: కరోనా వైరస్ నేపథ్యంలో బంతి స్వింగ్ కోసం ఉపయోగించే ఉమ్మిని నిషేధించాలనే ప్రతిపాదనను ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ వ్యతిరేకించాడు. ఎప్పట్నుంచో ఆనవాయితీగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని మార్చాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించాడు. ఈ మార్పుతో ఆటగాళ్ల ఆరోగ్యానికి రిస్క్ ఉండదనుకోవడం పొరపాటేనని క్రికెట్ ఆస్ట్రేలియా అధికారిక వెబ్‌సైట్‌కు తెలిపాడు.

బంతి మెరుపు కోసం లాలాజలాన్ని రుద్దడం వందల ఏళ్ల నుంచి ఉందన్నాడు. ఇలా చేయడం వల్ల పూర్తిగా వైరస్‌ను నియంత్రించవచ్చనే విషయాన్ని మనం చెప్పలేమన్నాడు. ఈ విధానాన్ని పూర్తిగా తొలగించి కొత్త మార్పును తీసుకొస్తారని తాను అనుకోవడం లేదని వార్నర్‌ అభిప్రాయపడ్డాడు.

ప్రత్యామ్నాయంగా ట్యాంపరింగ్..

ప్రత్యామ్నాయంగా ట్యాంపరింగ్..

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో బంతికి ఉమ్మి రుద్దడాన్ని నిలిపివేయాలనే ఐసీసీ భావిస్తోంది. దీనికి ప్రత్యామ్నాంగా అంపైర్ల సమక్షంలో బాల్‌ట్యాంపరింగ్‌కు అనుమతించాలని సమాలోచనలు చేస్తోంది. అయితే ఉమ్మి ఉపయోగించాడన్ని నిషేధిస్తే అది బ్యాట్స్‌మన్‌కు ఫేవర్‌గా మారుతుందని చాలా మంది క్రికెటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వ్యతిరేకిస్తున్న బౌలర్లు..

వ్యతిరేకిస్తున్న బౌలర్లు..

ఈ ప్రతిపాదనను ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు వ్యతిరేకించారు. పాకిస్తాన్‌ దిగ్గజ పేసర్‌ వకార్‌ యూనిస్‌, ఆశిష్‌ నెహ్రా, హర్భజన్‌ సింగ్‌ ఉమ్మికి ప్రత్యామ్నాయంగా ఏది అనుమతించినా ఇబ్బందులు తలెత్తుయాన్నారు. ఇదే అదునుగా చేసుకొని ఆటగాళ్లు బాటిళ్ల మూతలతో కూడా బంతి ఆకారాన్ని దెబ్బతీస్తారని హెచ్చరించారు. సాధ్యమైనంత వరకు ఉమ్మి వాడకాన్ని నిషేధించకపోతేనే మంచిదన్నారు. ఇక టీమిండియా స్పిన్నర్ చహల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఉమ్మి వాడకాన్ని నిషేధిస్తే.. సిక్స్ కొట్టిన బ్యాట్స్‌మనే బంతిని తెచ్చుకునే నిబంధనను తీసుకురావాలని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.

బౌలర్లకు నరకమే..

బౌలర్లకు నరకమే..

టెస్టుల్లో కేవలం ఆరంభ ఓవర్లలో మాత్రమే కాకుండా ఆ తర్వాత కూడా బ్యాట్స్‌మెన్‌కు, బౌలర్లకు మధ్య సమమైన పోరు జరగాలంటే బంతిని షైన్‌ చేయడం తప్పనిసరి. లేదంటే బ్యాట్స్‌మెన్‌ చితక్కొడతారు. ఉమ్మి వాడకాన్ని నిషేధిస్తే తమ కెరీర్‌ నరకప్రాయమవుతుందని ఇటీవలే ఆసీస్‌ పేసర్‌ కమిన్స్‌ కూడా అభిప్రాయపడ్డాడు. టాంపరింగ్‌ను ఐసీసీ నిషేధించినా... మ్యాచ్‌ చేజారిపోతున్న దశలో చాలా మంది వేర్వేరు వస్తువులతో బంతి ఆకారాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారు. అలాంటిది అధికారికంగా అనుమతిస్తే అంతే సంగతులనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ప్రత్యేక పదార్థం కొరకు..

ప్రత్యేక పదార్థం కొరకు..

స్మిత్, వార్నర్‌ ఉదంతంలో స్యాండ్‌ పేపర్‌ (ఉప్పు కాగితం) వాడగా...గతంలో సీసా బిరడా, చెట్టు జిగురు, వ్యాస్‌లైన్, ప్యాంట్‌ జిప్, జెల్లీ బీన్స్, మట్టి... ఇలా అనేక వస్తువులతో బంతి ఆకారాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరిగాయి. అయితే ఇప్పుడు ఐసీసీ ఏదైనా ఒక ప్రత్యేక పదార్థాన్ని అధికారికంగా టాంపరింగ్‌కు వాడేలా ఎంపిక చేయాలని భావిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం వాడుతున్న మూడు రకాల బంతులు ఎస్‌జీ, కూకాబుర్రా, డ్యూక్స్‌లన్నింటిపై ఒకే రకంగా పనిచేసేలా ఆ పదార్థం ఉండాలనుకుంటుంది.

బుట్ట బొమ్మ సాంగ్‌లో అదరగొట్టిన డేవిడ్ వార్నర్.!

Story first published: Thursday, April 30, 2020, 16:36 [IST]
Other articles published on Apr 30, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+