For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

డేవిడ్ వార్నర్‌ 'మహర్షి' టీజర్‌.. అచ్చం మహేశ్‌ బాబు‌లానే.. చూస్తే వావ్ అనాల్సిందే (వీడియో)!!

Australia openar David Warner’s hilarious New Year Eve treat as Mahesh Babu

హైదరాబాద్: డేవిడ్ వార్నర్.. ఈ పేరు గురించి క్రికెట్ అభిమానులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ అయిన వార్నర్.. మైదానంలోకి వచ్చాడంటే పరుగుల వరద పారాల్సిందే. టెస్ట్, వన్డే, టీ20 ఫార్మాట్ ఏదైనా అతడి బ్యాటింగ్ శైలి ఒకేలా ఉంటుంది. మొదటి బంతి నుంచే ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తుంటాడు. ఇక ప్రత్యర్థి ఎవరైనా, ఎంతటి మేటి బౌలర్ ముందున్నా.. వార్నర్‌కు తెలిసింది మాత్రమే ఒక్కటే!! అదే విరుచుకుపడడం. తన భీకర బ్యాటింగ్‌తో ఆస్ట్రేలియా జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. అయితే 2020లో మాత్రం వార్నర్ క్రికెట్ కంటే.. టిక్‌టాక్‌ వీడియోలతో అభిమానులను ఆకట్టుకున్నాడు.

టిక్‌టాక్‌ వీడియోలతో:

టిక్‌టాక్‌ వీడియోలతో:

2020 మార్చిలో కరోనా వైరస్‌ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ను డేవిడ్ వార్నర్ ఎంతో చక్కగా ఉపయోగించుకున్నాడు. హాయిగా కుటుంబ సభ్యులతో గడుపుతూనే టిక్‌టాక్‌ వీడియోలతో పాపులర్ అయ్యాడు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సాధించాడు. అలాగే తెలుగు సినిమా పాటలు, డైలాగులతో పలువురు టాలీవుడ్‌ టాప్‌ హీరోల అనుకరణ వీడియోలు రూపొందించాడు. ముఖ్యంగా సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్పూఫ్ వీడియోలతో ఆకట్టుకున్నాడు. దాంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అభిమానులకు మరింత చేరువయ్యాడు.

మహర్షిలా వార్నర్:

మహర్షిలా వార్నర్:

మరికొద్దిగంటల్లో 2020 కాలగర్భంలో కలుస్తున్న నేపథ్యంలో డేవిడ్ వార్నర్‌ తాజాగా మరో అద్భుత వీడియోతో అభిమానుల ముందుకొచ్చాడు. సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు నటించిన బ్లాక్ బస్టర్ సినిమా 'మహర్షి' టీజర్‌ను ఎడిట్‌ చేసి.. అందులోని సన్నివేశాలకు తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. స్కూటర్‌పై మహేశ్‌.. వెన్నెల కిషోర్‌తో వెళ్లే సీన్‌తో పాటు డైలాగులు, ఫైటింగ్‌ల సీన్లలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌‌ వావ్ అనిపించాడు. ఆ వీడియోను ఇన్‌స్టాలో పంచుకోవడంతో అభిమానులు తెగ లైకులు కొడుతున్నారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అయింది. వీడియో చూసిన ఫాన్స్ వావ్ అంటున్నారు. మీరు కూడా ఓ లుక్కేయండి.

భారత్‌లోనే ఫ్యాన్ ఫాలోయింగ్:

భారత్‌లోనే ఫ్యాన్ ఫాలోయింగ్:

ఐపీఎల్ పుణ్యమాని డేవిడ్ వార్నర్ లక్షలాది మంది భారతీయుల అభిమానం చూరగొన్నాడు. ముఖ్యంగా ఆరెంజ్‌ ఆర్మీ ఫాన్స్ వార్నర్‌ను హైదరాబాదీ అని, మా అన్న అని, కాండిస్‌ వార్నర్‌ను వదిన అంటూ ఆప్యాయంగా పిలుచుకుంటారు. నిజం చెప్పాలంటే.. డేవిడ్ వార్నర్‌కు ఆస్ట్రేలియా కంటే ఎక్కువగా భారత్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న వార్నర్.. అద్భుత ఆటతీరుతో భారత అభిమానుల మనసు దోచుకున్నాడు. అంతేకాదు మన తెలుగు జట్టుకు కప్ కూడా అందించాడు.

2009లో ఆరంగేట్రం:

2009, జనవరి 11న డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా టీ20 జట్టులోకి ఆరంగేట్రం చేశాడు. 2009, జనవరి 18న వన్డేల్లోకి వచ్చాడు. న్యూజీలాండ్ జట్టుపైనే పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లలో ఎంట్రీ ఇచ్చాడు. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత 2011, డిసెంబర్ 1న ఆసీస్ టెస్ట్ జట్టులో ఆరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి వెనుదిరికి చూసుకోలేదు. మద్యలో ఓ సంవత్సరం నిషేదానికి గురైనా.. అంతేవేగంగా పుంజుకున్నాడు. అంతర్జాతీయ కెరీర్‌లో వార్నర్ ఇప్పటివరకు 84 టెస్టుల్లో, 128 వన్డేల్లో, 81 టీ20 మ్యాచ్‌ల్లో ఆసీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. టెస్టుల్లో 7244, వన్డేల్లో 5445, టీ20ల్లో 2265 రన్స్ చేశాడు. మూడు ఫార్మాట్‌లలో కలిపి 43 సెంచరీలు బాదాడు.

ఈ దశాబ్దపు అత్యుత్తమ టిక్‌టాకర్‌గా డేవిడ్‌ వార్నర్‌!!

Story first published: Thursday, December 31, 2020, 13:56 [IST]
Other articles published on Dec 31, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+