ఇండోర్‌కు తరలింపు..
ఈ సిరీస్‌లోభాగంగా మార్చి 1 నుంచి ధర్మశాల వేదికగా జరగాల్సిన మూడో టెస్ట్‌ను బీసీసీఐ మరో చోటుకు తరలించింది. ధర్మశాలలో ఔట్‌ఫీల్డ్ సిద్ధంగా లేకపోవడంతో ఈ మ్యాచ్‌ను ఇండోర్‌కు తరలిస్తున్నట్లు ఓ ప్రకటనను విడుదల చేసింది. మూడో టెస్ట్‌కు ఇండోని హోల్కర్ మైదానం ఆతిథ్యం ఇస్తుందని పేర్కొంది. బీసీసీఐ క్యురేటర్ తపోష్ ఛటర్జీ ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ సంఘం (హెచ్‌పీసీఏ) స్టేడియం పిచ్, ఔట్‌ఫీల్డ్‌ను తనిఖీ చేసి బోర్డుకు నివేదిక అందించాడు. అయితే, తొలుత ఈ మ్యాచ్‌ని విశాఖపట్నం లేదా బెంగళూరుకు తరలిస్తారని వార్తలొచ్చాయి. చివరికి ఇండోర్‌ను వేదికగా ఖరారు చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.

పేస్‌కు అనుకూలిస్తుందనే..
అయితే సిరీస్ గెలవాలనే వ్యూహంలో భాగంగానే బీసీసీఐ చివరి నిమిషంలో వేదిక మారుస్తూ నిర్ణయం తీసుకుందని ఆస్ట్రేలియా మీడియా ఆరోపణలు గుప్పించింది. ధర్మశాల మైదానం పేసర్లకు అనుకూలంగా ఉంటుందని, ఇండోర్ మైదానం టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటుందని తెలిపింది. ఈ మైదానంలో అశ్విన్ బౌలింగ్ యావరేజ్ 12.50గా ఉందని, 18 వికెట్లు పడగొట్టాడని పేర్కొంది. ఆసీస్‌ను ఓడించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుందని ఫాక్స్ క్రికెట్ తమ కథనంలో రాసుకొచ్చింది. నాలుగు టెస్ట్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే గెలవాలనే వ్యూహంలో భాగంగా ఈ వేదికను తరలించారని పేర్కొంది. ఆస్ట్రేలియా మీడియా కథనాలను భారత అభిమానులు తిప్పికొడుతున్నారు.

కసిదీరా ఓడించాలనే..
ఇక, సిరీస్ విషయానికొస్తే నాగ్‌పుర్‌లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఢిల్లీ వేదికగా ఫిబ్రవరి 17 నుంచి రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లో కూడా కంగారు జట్టును కసిదీరా ఓడించాలని టీమిండియా భావిస్తోంది.
తొలి టెస్టులో ఘోర ఓటమిపాలైన ఆసీస్ ఈ మ్యాచ్‌లో గెలిచి పుంజుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగానే కొత్త స్పిన్నర్ మాట్ కుహ్నెమాన్‌ను జట్టులోకి తీసుకుంది.


Click it and Unblock the Notifications












