Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మా విజయాన్ని అలా తీసిపారేయడం దారుణం: ఆసీస్ హెడ్ కోచ్

న్యూఢిల్లీ: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23ను ఆస్ట్రేలియా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. భారత్‌తో జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన ఆసీస్ 209 పరుగుల భారీ తేడాతో గెలుపొంది డబ్ల్యూటీసీ టైటిల్ అందుకుంది. అయితే ఇంగ్లండ్ వేదికగా ఫైనల్ జరగడంతోనే ఆసీస్‌కు కలిసొచ్చిందనే అభిప్రాయం వ్యక్తమైంది.

తమ విజయాన్ని ఇలా తేలికగా తీసిపారేయడాన్ని ఆస్ట్రేలియా హెడ్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ తప్పుబట్టాడు. తమకు అనుకూలమైన పేస్ కండిషన్స్‌లోనే కాకుండా ఉపఖండ పిచ్‌లపై కూడా విజయాలు సాధించి ఫైనల్‌కు చేరామని గుర్తు చేశాడు. 2019-21 ఎడిషనల్‌లో స్లో ఓవర్ రేట్ పెనాల్టీల కారణంగా ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయామన్నాడు.

Australia head coach Andrew McDonald

కానీ ఈసారి పక్కా ప్లానింగ్‌తో బరిలోకి దిగి విజయాలందుకున్నామని మెక్‌డొనాల్డ్ చెప్పుకొచ్చాడు. 'ఉపఖండంలో మా పర్యటన పాకిస్థాన్ నుంచి శ్రీలంక మీదుగా భారత్ వరకు సాగింది. అక్కడ సాధించిన విజయాల వల్లే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకోగలిగాం. విజయం సాధించాం. ఆసీస్ గడ్డపై మేం చాలా బలమైన టీమ్ అని తెలుసు.

అందుకే చాలా మంది సొంతగడ్డపై సాధించిన విజయాలతోనే డబ్ల్యూటీసీ ఫైనల్ చేరిందని భావిస్తున్నారు. కానీ మేం పాకిస్థాన్, శ్రీలకంతో పాటు భారత్‌లోనూ విజయాలు నమోదు చేశార. దాంతోనే ఫైనల్ బెర్త్ ఖారారు అయ్యింది. ఈ టోర్నీ కొత్తగా వచ్చినప్పుడు సరైన ప్రణాళికలతో ముందుకు సాగలేకపోయాం. స్లోఓవర్ రేట్ కారణంగా ఫైనల్ చేరలేకపోయాం. కానీ ఈసారి పకడ్బందీ ప్రణాళికతో బరిలోకి దిగి ఛాంపియన్‌గా నిలిచాం. ఇప్పుడు మేం యాషెస్ సిరీస్ గెలవడంపై ఫోకస్ పెట్టాం.'అని మెక్‌డొనాల్డ్ చెప్పుకొచ్చాడు.

బోర్డార్ గవాస్కర్ ట్రోఫీ ముందు ఆసీస్ పాకిస్థాన్‌లో పర్యటించింది. అక్కడ 1-0తో టెస్ట్ సిరీస్ గెలిచింది. ఆ తర్వాత శ్రీలంకై రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది. భారత్ వేదికగా జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 1-2 తేడాతో ఓడిపోయింది. ఒక టెస్ట్ మ్యాచ్ గెలవడంతో డబ్ల్యూటీసీ బెర్త్ ఖరారు చేసుకుంది. శుక్రవారం నుంచి ఇంగ్లండ్‌-ఆసీస్ మధ్య యాషెస్ సిరీస్ జరగనుంది. ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌తోనే డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్ ప్రారంభం కానుంది.

Story first published: Tuesday, June 13, 2023, 20:49 [IST]
Other articles published on Jun 13, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+