Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: కొంపముంచిన కోహ్లీ, రోహిత్.. టీమిండియాకు తప్పని ఓటమి!

ఆస్ట్రేలియా పర్యటనను టీమిండియా ఓటమితో ప్రారంభించింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఆసీస్ డక్‌వర్త్ లూయిస్ ప్రకారం 7 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది. పదే పదే వర్షం అంతరాయం కలిగించడంతో ఈ మ్యాచ్‌ను 26 ఓవర్లకు కుదించారు.

ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 26 ఓవర్లలో 9 వికెట్లకు 136 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38), అక్షర్ పటేల్(38 బంతుల్లో 3 ఫోర్లతో 31), నితీష్ కుమార్ రెడ్డి(11 బంతుల్లో 2 సిక్సర్లతో 19 నాటౌట్) మినహా మరే బ్యాటర్ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన టీమిండియా వెటరన్ బ్యాటర్లు రోహిత్ శర్మ(8), విరాట్ కోహ్లీ(0) తీవ్రంగా నిరాశపర్చారు. ఆసీస్ బౌలర్లలో జోస్ హజెల్ వుడ్(2/20), మిచెల్ ఓవెన్(2/20), మాథ్యూ కుహ్నేమన్(2/14) రెండేసి వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్, నాథన్ ఎల్లిస్ తలో వికెట్ తీసారు.

Australia Defeat India as Virat Kohli and Rohit Sharma Fail in Batting Collapse

డక్‌వర్త్ లూయిస్ ప్రకారం ఆస్ట్రేలియా లక్ష్యాన్ని 26 ఓవర్లలో 131 పరుగులుగా నిర్ణయించారు. ఆసీస్ 21.1 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. కెప్టెన్ మిచెల్ మార్ష్(52 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 46 నాటౌట్), జోష్ ఫిలిప్(29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37), మ్యాట్ రేన్‌షా(24 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 21 నాటౌట్) రాణించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తీసారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో ఆసీస్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

భారీ అంచనాలతో బరిలోకి దిగిన రోహిత్ శర్మ(8), విరాట్ కోహ్లీ(0) వైఫల్యం టీమిండియా విజయవకాశాలను దెబ్బతీసింది. ఆరంభంలోనే ఈ ఇద్దరూ ఔటవ్వడంతో జట్టుపై అదనపు ఒత్తిడి పడింది. వర్షం కూడా టీమిండియా విజయవకాశాలను దెబ్బతీసింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే గురువారం(అక్టోబర్ 23) జరగనుంది.

Story first published: Sunday, October 19, 2025, 16:58 [IST]
Other articles published on Oct 19, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+