న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup 2021: మైకంలో కాదు.. అందుకే షూలో డ్రింక్స్ తాగారు!

 Australia Cricketers drink from shoe after winning T20 World Cup 2021
Drink From Shoe మందేస్తూ చిందేయరా... AUS Cricketers షూలో డ్రింక్ తాగడం ఏంట్రా? || Oneindia Telugu

దుబాయ్: వన్డే ప్రపంచకప్‌లో ఏకంగా ఐదు సార్లు విశ్వవిజేతగా నిలిచిన ఆస్ట్రేలియా.. గత 14 ఏళ్లుగా ఒక్క టీ20 ప్రపంచకప్‌ను కూడా గెలవలేకపోయింది. ఇప్పుడు ఆ ముచ్చటా కూడా తీరడంతో వారి ఆనందానికి హద్దే లేకుండా పోయింది. 2015 ప్రపంచకప్ తర్వాత ఆరేళ్లుగా మరో టైటిల్ అందుకోలేక.. ఈ టోర్నీకి ముందు బంగ్లాదేశ్ చేతిలో టీ20 సిరీస్ ఓడి.. పెద్దగా అంచనాలే లేకుండా వచ్చిన కంగారు టీమ్ అరబ్ గడ్డపై అద్భుతమే చేసింది. తమదైన శైలిలో తమకు మాత్రమే సాధ్యమయ్యే ఆటతో తొలిసారి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడింది. తమ పొరుగు దేశం న్యూజిలాండ్ ప్రపంచకప్ ఆశలపై నీళ్లు కుమ్మరిస్తూ.. పొట్టి ఫార్మాట్‌లో చాంపియన్ అయ్యింది. ఓవరాల్‌గా ఆరో ప్రపంచకప్‌తో సిక్సర్ కొట్టింది.

సమష్టిగా రాణించి 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి టైటిల్‌ను ముద్దాడింది. ఈ విజయంతో ఆసీస్ ఆటగాళ్ల సంతోషానికి హద్దేలేకుండా పోయింది. మ్యాచ్ ముగిసిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో వారు చేసిన రచ్చ మాములుగా లేదు. 'మందేస్తూ చిందేయరా.. చిందేస్తూ మందేయరా' అంటూ చేతిలో బీర్ టిన్స్ పట్టుకొని రచ్చరచ్చ చేశారు. తమకు నచ్చిన మ్యూజిక్‌తో చిందేశారు. శాంపైన్ బాటిల్‌తో డ్రెస్సింగ్ రూమ్‌ను తడిపేసారు.

ఈ సెలెబ్రేషన్స్‌లో భాగంగానే సెమీస్ హీరోలు మాథ్యూ వేడ్, మార్కస్ స్టోయినీస్ షూలో డ్రింక్ పోసుకొని తాగారు. ఈ వీడియోను ఐసీసీ ట్వీట్ చేయగా అభిమానులు అవాక్కయ్యారు. పీకల్లోతు దాకా తాగారా? మైకంలో ఏం చేస్తుందో తెలియడం లేదా? అంటూ కామెంట్ చేశారు. ఐదు గంటల పాటు ధరించిన షూలో డ్రింక్ తాగడం ఏంట్రా? యాక్ తూ.. అంటూ తప్పుబట్టారు.
అయితే షూలో డ్రింక్స్‌ తాగటం ఆస్ట్రేలియన్ల సంప్రదాయాల్లో ఒకటంట. అదృష్టం వరించినప్పుడు సంతోషంతో లేదంటే.. ఏవైనా కఠిన శిక్షల బారిన పడినపుడు ఇలా చేయడం వారికి అలవాటంటా. 'దాన్ని డూయింగ్ ఏ షోయ్' అంటారంటా. ఆ క్రమంలోనే ప్రపంచకప్ సాధించిన ఆనందంలో స్టోయినిస్, మాథ్యూ వేడ్ అలా చేశారని కొంతమంది నెటిజన్లు వివరణ ఇస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. కేన్‌ విలియమ్సన్‌ (48 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 85) అద్భుతంగా ఆడగా... హాజల్‌వుడ్‌ (3/16) బౌలింగ్‌లో రాణించాడు. అనంతరం ఆసీస్‌ 18.5 ఓవర్లలో 2 వికెట్లకు 173 పరుగులు చేసి గెలిచింది. 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' మిచెల్‌ మార్ష్ (50 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 77 నాటౌట్‌), డేవిడ్‌ వార్నర్‌ (38 బంతుల్లో4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 53) రెండో వికెట్‌కు 59 బంతుల్లోనే 92 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. మొత్తం 289 పరుగులు చేసిన వార్నర్‌ 'ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ'గా నిలిచాడు.

Story first published: Monday, November 15, 2021, 15:38 [IST]
Other articles published on Nov 15, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X