ఆస్ట్రేలియా క్రికెట్ అవార్డ్స్ ఫంక్షన్ ఘనంగా జరిగింది. సినిమా ఫంక్షన్ తరహాలో సాగిన ఈ కార్యక్రమానికి ఆస్ట్రేలియా ఆటగాళ్లు సతీసమేతంగా హాజరయ్యారు. కలర్‌ఫుల్ డ్రెస్స్‌లో సతీమణులతో కనువిందు చేశారు. హాలీవుడ్ హీరో, హీరోయిన్లను తలపించేలా తయారైన ఆసీస్ ఆటగాళ్లు.. వారి సతీమణులు కెమెరాలకు సినీ తారల్లా ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెటర్లు, వారి సతీమణులకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు ఇది క్రికెట్ అవార్డ్స్ ఫంక్షనా? లేక అందాల పోటీనా? అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఇక గతేడాది అసాధారణ ప్రదర్శన కనబర్చిన ఆస్ట్రేలియా క్రికెటర్లకు క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) అవార్డులు అందజేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటటే.. క్రికెట్ ఆస్ట్రేలియా అందించే అవార్డుల్లో అత్యుత్తమైన అవార్డ్ అయిన అలెన్ బోర్డర్ మెడల్ మిచెల్ మార్ష్‌కు దక్కింది. రెండు ఐసీసీ టైటిళ్లు గెలిపించిన ప్యాట్ కమిన్స్‌కు బదులు మిచెల్ మార్ష్‌కు ఈ అవార్డు ఇవ్వడం విశేషం.

అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు అవార్డులు అందజేయడంతో పాటు గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన షాన్ మార్ష్, మెగ్ లాన్నింగ్, ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్‌లను ఘనంగా సన్మానించింది.

ఆస్ట్రేలియా క్రికెట్ అవార్డ్స్ గెలుచుకున్న ఆటగాళ్లు:
అలెన్ బోర్డర్ మెడలిస్ట్: మిచెల్ మార్ష్
బెలిండా క్లాక్ అవార్డ్: అశ్లే గార్డ్‌నర్
షేన్ వార్న్ పురుషుల టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్: నాథన్ లయన్
పురుషుల వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్: మిచెల్ మార్ష్
మహిళల వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్: ఎల్లిస్ పెర్రీ
పురుషుల టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్: జాసన్ బెహ్రెండార్ఫ్
మహిళల టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్: ఎల్లిస్ పెర్రీ
పురుషుల డొమెస్టిక్ క్రికెట్ ఆఫ్ ది ఇయర్: కామెరూన్ బెన్‌క్రాఫ్ట్
మహిళల డొమెస్టిక్ క్రికెట్ ఆఫ్ ది ఇయర్: సోఫీ డే, ఎలిస్ విల్లనీ
బ్రాడ్‌మన్ యంగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్: ఫెర్గస్ ఓ నీల్
బెట్టీ విల్సన్ యంగ్ క్రికెట్ ఆఫ్ ది ఇయర్: ఎమ్మా డీ బ్రౌఫ్
కమ్యూనిటీ ఇంపాక్ట్ అవార్డ్: అశ్లే గార్డ్‌నర్
బీబీఎల్ ప్లేయర్ ఆఫ్ టోర్నీ: మాథ్యూ షార్ట్
డబ్ల్యూబీబీఎల్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ: చమరి ఆటపట్టు
వూల్‌వర్త్స్ క్రికెట్ బ్లాస్టర్ ఆఫ్ ది ఇయర్: తాజ్ బోవర్