Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బంగ్లా చేతిలో ఓటమి.. ఆసీస్‌కు రూ.42 లక్షల జరిమానా!

పసికూన బంగ్లాదేశ్ చేతిలో చిత్తుగా ఓడిన ఆస్ట్రేలియాకు మరో షాక్ తగలనుంది. స్లో ఓవర్‌రేట్ కారణంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ)2027 పాయింట్స్ టేబుల్‌లో పాయింట్స్ కోతతో పాటు రూ.42 లక్షల(44 వేల డాలర్లు) జరిమానా ఎదుర్కునే అవకాశం ఉంది.

రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా డార్విన్ వేదికగా ఆదివారం ముగిసిన తొలి టెస్ట్‌లో సమష్టిగా రాణించిన బంగ్లాదేశ్ 9 వికెట్ల తేడాతో ఆసీస్‌ను ఓడించింది. టెస్ట్ క్రికెట్‌ చరిత్రలోనే ఆసీస్‌పై బంగ్లాదేశ్‌కు ఇదే తొలి టెస్ట్ విజయం. అది కూడా వారి సొంతగడ్డపై ఓడించి బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది.

టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద సంచలనం.. ఆసీస్‌కు బిగ్ షాక్!

టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద సంచలనం.. ఆసీస్‌కు బిగ్ షాక్!

ఆసీస్ పాయింట్స్‌లో కోత..

అయితే ఈ మ్యాచ్‌లో ఆసీస్ స్లో ఓవర్‌ రేట్‌కు కారణమైంది. మూడో రోజు ఆటలో నిర్ణీత సమయం కన్నా 4 ఓవర్లు తక్కువగా వేసింది. దీంతో ఐసీసీ రూల్స్ ప్రకారం ఒక్కో ఓవర్‌కు ఒక్కో పాయింట్ చొప్పున నాలుగు పాయింట్స్ కోత పడనుండగా.. ఓవర్‌కు ఐదు శాతం చొప్పున మ్యాచ్ ఫీజులో కోత విధించనున్నారు.

Australia Could Face 44 000 Fine WTC Points Deduction After Shock Bangladesh Test Loss

ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఒక్క టెస్ట్ మ్యాచ్‌కు రూ. 19 లక్షల మ్యాచ్ ఫీజు దక్కనుంది. ఈ లెక్కన ఆసీస్ తుది జట్టు మొత్తానికి రూ. 42 లక్షల జరిమాన పడనుంది. ఈ లెక్కన ఒక్కో ఆటగాడు 3 లక్షల 82 వేలు నష్టపోనున్నాడు. స్లో ఓవర్ రేట్ చర్యలపై ఐసీసీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. పాయింట్ల కోత ఆసీస్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రస్తుతం ఆసీసీ 84 పాయింట్లతో డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 198 పరుగులకే ఆలౌట్ అయింది. స్టీవ్ స్మిత్ 71 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బంగ్లా యువపేసర్ హసన్ మహమూద్ 6 వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించాడు. అనంతరం బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 138 ఓవర్లలో 426 పరుగులకు ఆలౌటైంది. తంజీద్ హసన్(197 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 101) సెంచరీతో చెలరేగగా.. నజ్ముల్ హోస్సేన్ షాంటో(126 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 84), మెహ్‌దీ హసన్(154 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 65) హాఫ్ సెంచరీలతో రాణించారు.

చారిత్రాత్మక పోరుకు నాయకత్వం గర్వంగా ఉంది.. అదే తలనొప్పిగా మారింది: శుభ్‌మన్ గిల్

Also Read

చారిత్రాత్మక పోరుకు నాయకత్వం గర్వంగా ఉంది.. అదే తలనొప్పిగా మారింది: శుభ్‌మన్ గిల్

ఆసీస్ బౌలర్లలో జోష్ హేజిల్ వుడ్(6/89) ఆరు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్(2/79) రెండు వికెట్లు పడగొట్టాడు. ప్యాట్ కమిన్స్, నాథన్ లయన్ తలో వికెట్ తీసారు. దాంతో బంగ్లాదేశ్‌కు 228 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్ ఆస్ట్రేలియా 284 పరుగులకే ఆలౌటైంది. కామెరూన్ గ్రీన్(104) సెంచరీతో రాణించినా ఫలితం లేకపోయింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం నేపథ్యంలో బంగ్లాదేశ్ ముందు 57 పరుగుల లక్ష్యమే నమోదవ్వగా.. ఆ జట్టు 14.2 ఓవర్లలోనే ఛేదించి చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. 23 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై టెస్ట్ మ్యాచ్ ఆడిన బంగ్లాదేశ్.. అద్భుత విజయాన్ని అందుకుంది. రెండో టెస్ట్ ఆగస్ట్ 22 మకే వేదికగా ప్రారంభం కానుంది.

Story first published: Monday, August 17, 2026, 15:45 [IST]
Other articles published on Aug 17, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+