Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ సాండ్​విచ్​ వల్లే నా​పై ఆటగాళ్లకు కోపం: ఆసీస్ కోచ్

Australia coach Justin Langer names player who carried sandwich to ground

సిడ్నీ: టీమిండియా చేతిలో ఓటమిపాలయ్యాక ఆస్ట్రేలియా జట్టులోని పలువురు ఆటగాళ్లు కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ పట్ల అసంతృప్తితో ఉన్నారన్న వార్తలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. మొదట అలాంటివేం లేవని కొట్టిపారేసిన ఆస్ట్రేలియా కోచ్‌ తర్వాత నిజమేనని అంగీకరించాడు. తాజాగా ఆటగాళ్ల అసంతృప్తికి గల కారణాన్ని తెలియజేశాడు. సాండ్ విచ్‌ను మైదానంలోకి తీసుకెళ్లొద్దని చెప్పడంతోనే ఆటగాళ్లంతా తనపై అలిగారని పేర్కొన్నాడు. అయితే జట్టు అంతర్గత సమస్యలు ఇతర వ్యక్తుల ద్వారా బయటకు రావడం తనను బాధించిందన్నాడు.

 ఆ మాట చెప్పడంతో..

ఆ మాట చెప్పడంతో..

'గబ్బా టెస్టులో ఓ రోజు భోజన విరామం తర్వాత మార్నస్‌ లబుషేన్​కు‌ టోస్టెడ్‌ సాండ్‌విచ్‌ను మైదానంలోకి తీసుకెళ్లొద్దని చెప్పడమే ప్రస్తుత పరిస్థితులకు సగం కారణం. దాంతో నేనిప్పుడు ప్రపంచంలోనే చెడ్డ వ్యక్తిగా మిగిలిపోయాను. ఆస్ట్రేలియా జట్టు ప్రమాణాలు దిగజారిపోతున్నాయని భావిస్తే నా కోపాన్ని అదుపుచేసుకోలేను. నాయకత్వం అనేది పాపులారిటీ కాదు. కొన్నిసార్లు కఠిన పరిస్థితులు ఎదుర్కోవాలి.. కొన్నిసార్లు కఠినంగానూ ఉండాలి. అయితే, మనపై వచ్చే విమర్శలనూ చిరునవ్వుతో స్వీకరించి తప్పులు దిద్దుకోవాలి.

నా తప్పులను సరిదిద్దుకుంటా..

నా తప్పులను సరిదిద్దుకుంటా..

అలాగే నాలో ఉన్న ఒక మంచి విషయం ఏంటంటే స్వీయ పరిశీలన చేసుకుంటా. ఎవరైనా నాలో తప్పులు చూపిస్తే వాటిని సరిదిద్దుకుంటా. లేకపోతే ఇక్కడివరకు వచ్చేవాడిని కాదు. నాకొచ్చే సలహాల్లో పనికి వచ్చే వాటిని స్వీకరించి ముందుకు సాగుతా. అయితే, ఇప్పుడు నన్ను బాధించేది ఒకటే విషయం. ఈ అంతర్గత సమస్యలన్నీ ఆటగాళ్ల నుంచి బయటకు రావటమే.

 నేనేం ఉత్తముడిని కాదు.

నేనేం ఉత్తముడిని కాదు.

నేనెలాంటి వాడినో మీకు తెలుసు. నిజంగానే కొన్నిసార్లు కఠినంగా ఉంటా, కొన్నిసార్లు కోపంగా ఉంటా. నేను మరీ అంత ఉత్తముడిని కాకపోయినా కొన్ని విషయాల్లో చాలా మంచివాడిని. కానీ, జట్టు అంతర్గత విషయాలు ఇతరుల ద్వారా బయటకు రావడమే నచ్చలేదు. దానికంటే ఆటగాళ్లు నేరుగా వచ్చి నాతో మాట్లాడితే బాగుండేది. దీనిపై అందరం కూర్చొని చర్చించుకుంటే సరిపోతుంది అని లాంగర్ చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, February 4, 2021, 20:44 [IST]
Other articles published on Feb 4, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+