Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బంగ్లా చేతిలో ఘోర పరాజయం.. ఆస్ట్రేలియా టీమ్‌లో కీలక మార్పు!

పసికూన బంగ్లాదేశ్ చేతిలో ఎదురైన ఘోర పరాజయం నేపథ్యంలో ఆస్ట్రేలియా కీలక నిర్ణయం తీసుకుంది. రెండో టెస్ట్‌ కోసం జట్టులో మార్పు చేసింది. తొలి టెస్ట్‌లో దారుణంగా విఫలమైన ఓపెనర్ జేక్ వెదరాల్డ్‌పై వేటు వేసి మాథ్యూ రేన్‌షాను తిరిగి జట్టులోకి తీసుకుంది. సాధారణంగా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆసీస్ తమ జట్టును మార్చదు. కానీ బంగ్లాదేశ్ చేతిలో ఎదురైన ఘోర పరాజయంతో ఆ జట్టు తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.

బంగ్లాదేశ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌ ఓటమితో సిరీస్‌లో 0-1తో ఆసీస్ వెనుకంజలో నిలిచింది. ఈ క్రమంలోనే రెండో టెస్ట్‌లో గెలిచి సిరీస్ సమం చేయాలనే పట్టుదలతో ఉంది. దాంతోనే తుది జట్టును మార్పు చేసింది. తొలి టెస్ట్‌లో వెదర్లాడ్ 23, 0కే పెవిలియన్ చేరాడు.

Australia Announce Squad for 2nd Test Against Bangladesh Matthew Renshaw Replaces Jake Weatherald

మూడేళ్ల క్రితం చివరి టెస్ట్..

వెదర్లాడ్ స్థానంలో జట్టులోకి వచ్చిన రెన్‌ షా చివరిసారిగా ఆసీస్ తరఫున మూడేళ్ల క్రితం ఆడాడు. ఢిల్లీ వేదికగా భారత్‌తో 2023లో రెన్‌ షా ఆఖరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో అవకాశాలు రాకపోయినా.. పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టులో మాత్రం ప్లేస్ సంపాదిస్తున్నాడు. మరోవైపు బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్ విఫలమైన స్టార్ ఆటగాడు మార్నస్ లబుషేన్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఆగస్ట్ 22 నుంచి రెండో టెస్ట్ ప్రారంభం కానుంది.

పాంటింగ్ ఫైర్..

బంగ్లాదేశ్ చేతిలో ఎదురైన ఓటమిపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ ఘాటుగా స్పందించాడు. 'సాధారణంగా జట్టును కలిపి ఉంచేందుకే నేను మొగ్గు చూపుతాను. పరిస్థితి చేయి దాటితే తప్ప ఆటగాళ్లను తొలగించాలనే ఆలోచన చేయను. కానీ ఈ డార్విన్ పరాజయం తర్వాత ఆస్ట్రేలియా జట్టులో మార్పులు అనివార్యమని స్పష్టమవుతోంది.

ముఖ్యంగా ఓపెనింగ్ స్థానంతో పాటు మూడో నంబర్ బ్యాటింగ్ స్థానాల్లో కొత్త ఆటగాళ్లను తీసుకొచ్చే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి. ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు" అని రికీ పాంటింగ్ పేర్కొన్నారు.

రెండో టెస్ట్‌కు ఆస్ట్రేలియా జట్టు:

పాట్ కమిన్స్(కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కేరీ, కామెరూన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబుషేన్, నాథన్ లయన్, మాథ్యూ రెన్ షా, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్‌స్టర్.

Story first published: Tuesday, August 18, 2026, 11:53 [IST]
Other articles published on Aug 18, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+