Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆస్ట్రేలియా సరిహద్దులు బంద్ .. టీమిండియా టూర్‌‌కు దెబ్బ!

Australia 6-month travel ban could affect Indias tour in October

సిడ్నీ: కరోనా దెబ్బకు క్రీడాలోకం అతలాకుతలం అయిపోయింది. టోక్యో ఒలింపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడగా.. ఇప్పుడు క్రికెట్‌కు సంబంధించిన ఒక్కో ఈవెంట్ వెనక్కి జరిగే అవకాశం కనిపిస్తోంది. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఆస్ట్రేలియా తమ సరిహద్దులను ఆరు నెలల పాటు మూసివేయాలనే నిర్ణయానికి రావడంతో పలు కీలక టోర్నీల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

 టీ20 ప్రపంచకప్ కూడా..

టీ20 ప్రపంచకప్ కూడా..

అక్టోబర్‌లో టీమిండియా ఆసీస్ టూర్‌తో పాటు టీ20 ప్రపంచకప్‌ ఈ జాబితాలో పెద్దవి. అక్టోబర్‌లో జరిగే టీ20 ట్రై సిరీస్‌తో మొదలయ్యే టీమిండియా ఆసీస్ పర్యటన.. డిసెంబర్‌లో టెస్ట్ సిరీస్‌తో ముగుస్తుంది. ఈ మధ్యలో అక్టోబర్ 18న ఆసీస్ వేదికగా టీ20 వరల్డ్‌కప్ మొదలవుతుంది.

2వేల కరోనా కేసులు..

2వేల కరోనా కేసులు..

ప్రస్తుతం ఆస్ట్రేలియాలో రెండు వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు ఉండగా.. 16 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆసీస్ ప్రభుత్వం సరిహద్దులు మూసి వేసింది. ఓ పక్క ఐపీఎల్ విషయంలో ఎటు తేల్చుకోలేక గందరగోళంలో ఉన్న బీసీసీఐకి ఇప్పుడిదో కొత్త సమస్యగా మారింది. ఆస్ట్రేలియా ప్రభుత్వ నిర్ణయం వల్ల నిజానికి ఏ టీమ్ కూడా ఆ దేశంలో అడుగుపెట్టలేదు.

 పరిస్థితులు అదుపులోకి వస్తే..

పరిస్థితులు అదుపులోకి వస్తే..

వరల్డ్ టీ20 సహా అన్ని సిరీస్‌లను ఇది ప్రభావితం చేయనుంది. అయితే పరిస్థితులు అదుపులోకి వస్తే 6 నెలల నిషేధాన్ని ఏక్షణమైనా ఎత్తివేస్తారని, అందువల్ల కంగారు పడాల్సిన పనిలేదని బీసీసీఐ ఆఫీస్ బేరర్ ఒకరు తెలిపారు. ఒకవేళ ట్రావెల్ బ్యాన్ 6 నెలలపాటు కొనసాగితే మాత్రం లాజిస్టికల్ సమస్యలు తప్పవని బోర్డుకు చెందిన మరో అధికారి అన్నారు. వీసాలు,టిక్కెట్ల విషయంలో తలనొప్పులు తప్పవన్నారు. సెప్టెంబర్‌లో ఇంగ్లండ్ జట్టు ఇండియా టూర్‌పై కూడా సందేహాలు నెలకొన్నాయి.

Story first published: Monday, March 30, 2020, 11:35 [IST]
Other articles published on Mar 30, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+