For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

AUS vs WI: చరిత్ర సృష్టించిన మ్యాక్స్‌వెల్!

ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ గ్లేన్ మ్యాక్స్‌‌వెల్ చరిత్ర సృష్టించాడు. విధ్వంసకర శతకంతో టీ20ల్లో అత్యధిక శతకాలు బాదిన బ్యాటర్‌గా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సరసన నిలిచాడు. వెస్టిండీస్‌తో రెండో టీ20లో మ్యాక్స్‌వెల్ 50 బంతుల్లోనే 9 ఫోర్లు, 7 సిక్స్‌ల సాయంతో మెరుపు శతకాన్ని అందుకున్నాడు.

ఇది మ్యాక్స్‌వెల్‌కు కెరీర్‌లో ఐదో అంతర్జాతీయ టీ20 సెంచరీ. దాంతో అత్యధిక సెంచరీలతో టాప్‌లో ఉన్న రోహిత్ శర్మ సరసన మ్యాక్స్‌వెల్ నిలిచాడు. అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన బ్యాటర్‌గా మ్యాడ్ మాక్సీ చరిత్రకెక్కాడు.

AUS vs WI: Glenn Maxwell equals Rohit Sharmas record with stunning hundred in 2nd T20I vs West Indies

143 ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ శర్మ 5 సెంచరీలు నమోదు చేస్తే.. గ్లేన్ మ్యాక్స్‌వెల్ 94 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనతను అందుకున్నాడు. టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ 47 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలు బాది ఈ జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ మ్యాచ్‌లో గ్లేన్ మ్యాక్స్‌వెల్ 109 మీటర్ల భారీ సిక్సర్ బాదాడు.

ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. గ్లేన్ మ్యాక్స్‌వెల్(55 బంతుల్లో 12 ఫోర్లు, 8 సిక్స్‌లతో 120 నాటౌట్) విధ్వంసకర శతకంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 241 పరుగుల భారీ స్కోర్ చేసింది. టీమ్ డేవిడ్(14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31 నాటౌట్), మిచెల్ మార్ష్(12 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 29) మెరుపులు మెరిపించారు.

విండీస్ బౌలర్లలో జాసన్ హోల్డర్(2/42) రెండు వికెట్లు తీయగా.. అల్జారీ జోసెఫ్, రొమారియో షెఫర్డ్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన వెస్టిండీస్ 110 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కెప్టెన్ రోవ్‌మన్ పోవెల్(31 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 53 బ్యాటింగ్) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఆ జట్టు విజయానికి 28 బంతుల్లో 79 పరుగులు కావాలి.

Story first published: Sunday, February 11, 2024, 17:03 [IST]
Other articles published on Feb 11, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+