ఆస్ట్రేలియా గడ్డపై సౌతాఫ్రికా విధ్వంసకర బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ దుమ్మురేపుతున్నాడు. మూడు టీ20ల సిరీస్‌లో ఇప్పటికే ఓ అజేయ శతకంతో చెలరేగిన డెవాల్డ్ బ్రెవిస్.. తాజాగా జరిగిన ఆఖరి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. 49 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును బ్రెవిస్(26 బంతుల్లో ఫోర్,6 సిక్స్‌లతో 53) ఆదుకున్నాడు. ట్రిస్టన్ స్టబ్స్(23 బంతుల్లో 2 ఫోర్లతో 25) సాయంతో నాలుగో వికెట్‌కు 61 పరుగులు జోడించాడు.
దాంతో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 172 పరుగులు చేసింది. డెవాల్డ్ బ్రెవిస్‌కు తోడుగా రాసీ వాన్ డెర్ డస్సెల్(26 బంతుల్లో 3 ఫోర్లతో 38 నాటౌట్) రాణించాడు. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్(3/31) మూడు వికెట్లు తీయగా.. జోష్ హజెల్ వుడ్(2/30), ఆడమ్ జంపా(2/24) రెండేసి వికెట్లు పడగొట్టారు.

ఈ మ్యాచ్‌లో 6 సిక్స్‌లు కొట్టడం ద్వారా డెవాల్డ్ బ్రెవిస్ అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకున్నాడు. ఆసీస్ గడ్డపై టీ20ల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో అతను విరాట్ కోహ్లీ రికార్డ్‌ను అధిగమించాడు. ఆస్ట్రేలియా గడ్డపై 10 టీ20 ఇన్నింగ్స్‌ల్లో విరాట్ కోహ్లీ 12 సిక్స్‌లు కొట్టగా.. డెవాల్డ్ బ్రెవిస్ మూడు ఇన్నింగ్స్‌ల్లోనే 14 సిక్స్‌లు బాది ఈ రికార్డ్‌ను అధిగమించాడు.
ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియాతో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్లలో డెవాల్డ్ బ్రెవిస్(3 ఇన్నింగ్స్‌ల్లో 14 సిక్స్‌లు), విరాట్ కోహ్లీ(10 ఇన్నింగ్స్‌ల్లో 12 సిక్స్‌లు), శిఖర్ ధావన్ (8 ఇన్నింగ్స్‌ల్లో 9 సిక్స్‌లు), ఆండ్రీ రస్సెల్(4 ఇన్నింగ్స్‌ల్లో 9 సిక్స్‌లు), రవి బొపారా(3 ఇన్నింగ్స్‌ల్లో 7 సిక్స్‌లు) ఉన్నారు.