
అడిలైడ్: వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ 2023లో ఆస్ట్రేలియా దుమ్మురేపుతోంది. సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్ట్‌ల సిరీస్ 2-0తో క్లీన్ స్వీప్ చేసిన ఆసీస్.. 75 శాతం విజయాలతో డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. వెస్టిండీస్‌తో అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా 419 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.
497 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ 77 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్(3/29), మైఖేల్ నెసర్(3/22), స్కాట్ బొలాండ్(3/16) మూడేసి వికెట్లతో తీన్మార్ వేయగా.. నాథన్ లియోన్ ఓ వికెట్ పడగొట్టాడు. వెస్టిండీస్ బ్యాటర్లలో ముగ్గురు డకౌట్ అవ్వడం గమనార్హం. టాగెనరైన్ చంద్రపాల్(17) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
గురువారం ప్రారంభమైన ఈ టెస్ట్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు మొదటి ఇన్సింగ్‌లో 511 పరుగులు చేసి భారీ స్కోరు సాధించిన విషయం తెలిసిందే. మార్నస్ లబుషేన్ (163), ట్రావిస్ హెడ్ (175) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేయగలిగింది. 137 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 511 పరుగులు స్కోరు చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండిస్ 214 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆస్ట్రేలియాకు 297 పరుగుల ఆధిక్యం లభించింది. ఫాలో ఆన్ ఆడించకుండా ఆస్ట్రేలియా రెండో ఇన్సింగ్‌ను ప్రారంభించింది. ఆరు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసిన ఆస్ట్రేలియా జట్టు డిక్లేర్ చేసి... వెస్టిండీస్ ముందు 396 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. రెండో ఇన్సింగ్‌లోనూ వెస్టిండిస్ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. 38/4 ఓవర్ నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన వెస్టిండీస్ మరో 18 ఓవర్లలోనే మిగిలిన 6 వికెట్లు కోల్పోయింది. దాంతో మూడున్నర రోజుల ఆటలోనే ఈ మ్యాచ్ ఫలితం తేలింది. తొలి టెస్ట్‌లో కూడా ఆసీసే గెలవడంతో సిరీస్ కంగారుల వశమైంది. ఈ ఓటమితో వెస్టిండీస్.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి తప్పుకుంది.