Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

AUS vs WI: విచిత్రకర ఘటన.. అప్పీల్ చేయని ఆటగాళ్లు.. ఔటివ్వని అంపైర్! (వీడియో)

క్రికెట్ చరిత్రలో కనీ వినీ ఎరుగని ఘటన చోటు చేసుకుంది. ఓ రనౌట్ విషయంలో ఆటగాళ్లు అప్పీల్ చేయకపోవడంతో అంపైర్ ఔట్ ఇవ్వలేదు. బిగ్ స్క్రీన్‌పై ఔటని తేలినా.. ఎవరూ అప్పీల్ చేయకపోవడంతో ఫీల్డ్ అంపైర్ నాటౌటిచ్చాడు. దాంతో ఆటగాళ్లు షాకయ్యారు. ఈ విచిత్రకర ఘటన ఆస్ట్రేలియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో టీ20లో చోటు చేసుకుంది.

ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 241 పరుగుల భారీ స్కోర్ చేసింది. గ్లేన్ మ్యాక్స్‌వెల్(55 బంతుల్లో 12 ఫోర్లు, 8 సిక్స్‌లతో 120 నాటౌట్) విధ్వంసకర శతకంతో చెలరేగగా.. టీమ్ డేవిడ్(14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31 నాటౌట్), మిచెల్ మార్ష్(12 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 29) మెరుపులు మెరిపించారు.

AUS vs WI: Alzarri Joseph Survives As Australia Fail To Appeal For Run Out Goes Viral

అనంతరం లక్ష్యచేధనకు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 207 పరుగులే చేసి 34 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కెప్టెన్ రోవ్‌మన్ పోవెల్(36 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 63 బ్యాటింగ్) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు.

అయితే వెస్టిండీస్ ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో అల్జారీ జోసెఫ్ రనౌటయ్యాడు. ఈ ఓవర్ మూడో బంతిని కవర్స్ వైపు ఆడి క్విక్ సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. బంతిని అందుకున్న ఆసీస్ ఫీల్డర్.. బౌలర్ స్పెన్సర్ జాన్సన్‌కు అందివ్వగా అంతేవేగంగా అతను నాన్‌స్ట్రైకర్ వికెట్లను పడగొట్టాడు. అల్జారీ జోసెఫ్ అప్పటికీ క్రీజు చేరుకోలేదు.

రనౌట్ చేసిన ఆనందంలో ఆసీస్ ఆటగాళ్లు.. అప్పీల్ చేయడం మరిచిపోయారు. దాంతో ఫీల్డ్ అంపైర్ రివ్యూ తీసుకోకపోవడంతో పాటు నిర్ణయాన్ని ప్రకటించలేదు. దాంతో షాక్‌కు గురైన ఆసీస్ ఆటగాళ్లు.. అంపైర్‌ను నిలదీయగా అప్పీల్ చేయలేదని సమాధానమిచ్చాడు. టీమ్ డేవిడ్ తాను అప్పీల్ చేసినట్లు చెప్పగా.. రిప్లేలను పరిశీలించి ఎవరూ అప్పీల్ చేయలేదనే విషయాన్ని అంపైర్ చూపించాడు.

దాంతో ఆసీస్ ఆటగాళ్లు నవ్వుకుంటూ వెళ్లిపోయారు. ఇక అప్పీల్ చేయకుండా బచాయించిన తొలి బ్యాటర్‌గా అల్జారీ జోసెఫ్ చరిత్రకెక్కాడు.ప్రస్తుతం ఈ విచిత్రకర ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. అంపైర్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆసీస్ ఆటగాళ్లు మహానుభావులు అంటూ సెటైర్లు పేల్చుతున్నారు.

Story first published: Monday, February 12, 2024, 10:45 [IST]
Other articles published on Feb 12, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+