Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

AUS vs SA: చరిత్ర సృష్టించిన ఆర్‌సీబీ హిట్టర్.. 16 ఏళ్ల రికార్డ్ బద్దలు!

ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ టీమ్ డేవిడ్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో సౌతాఫ్రికా జట్టుపై ఓ మ్యాచ్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన ఆసీస్ బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ పేరిట ఉన్న 16 ఏళ్ల రికార్డ్‌ను బద్దలు కొట్టాడు. సొంతగడ్డపై సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా డార్విన్ వేదికగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా టీమ్ డేవిడ్ ఈ ఫీట్ సాధించాడు.

ఈ మ్యాచ్‌లో టీమ్ డేవిడ్ 52 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్‌లతో 83 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ క్రమంలోనే అతను వార్నర్ రికార్డ్‌ను బ్రేక్ చేశాడు. డేవిడ్ వార్నర్ 2009లో సౌతాఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో 6 సిక్స్‌లు కొట్టాడు. తాజా మ్యాచ్‌లో టీమ్ డేవిడ్ 8 సిక్స్‌లు కొట్టడం ద్వారా ఆ రికార్డ్‌ను అధిగమించాడు.

AUS vs SA Tim David Smashes 16-Year-Old David Warner Record in First T20I vs South Africa

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌటైంది. టీమ్ డేవిడ్(83)తో పాటు కామెరూన్ గ్రీన్(13 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 35) మాత్రమే రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో క్వెన మఫకా(4/20) నాలుగు వికెట్లు తీయగా.. కగిసో రబడా(2/29) రెండు వికెట్లు పడగొట్టాడు. లుంగి ఎంగిడి, జార్జ్ లిండే, సెనురన్ ముత్తుసామీ తలో వికెట్ తీసారు. 75 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును టీమ్ డేవిడ్ ఆదుకున్నాడు. బెన్ ద్వార్షుయిస్(17)తో ఏడో వికెట్‌కు 59 పరుగులు జోడించిన టీమ్ డెవిడ్.. నాథన్ ఎల్లిస్‌తో కలిసి 8వ వికెట్‌కు 30 పరుగుల జోడించాడు.

ఐపీఎల్ 2025 సీజన్‌లో టీమ్ డేవిడ్.. ఆర్‌సీబీకి ఆడిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన టీమ్ డేవిడ్.. 62.33 సగటుతో 187 పరుగులు చేశాడు. ఇందులో ఓ హాఫ్ సెంచరీ కూడా ఉంది. లోయరార్డర్‌లో అసాధారణ బ్యాటింగ్‌తో ఆర్‌సీబీకి చిరస్మరణీయ విజయాలందించాడు.

Story first published: Sunday, August 10, 2025, 18:25 [IST]
Other articles published on Aug 10, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+