
అబుదాబి: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. వికెట్ చూడటానికి బాగుందని ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ అన్నాడు. ఆట సాగుతున్నా పిచ్‌లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. మాకు మంచి అనుభవం ఉంది. కాకపోతే ఈ మధ్య సమష్టిగా రాణించలేకపోయాం. కానీ ఈ టోర్నీలో కలిసికట్టగా రాణించాలనుకుంటున్నాం. టీమ్ ఎంపిక చాలా కష్టంగా మారింది. అష్టన్ అగర్, కేన్ రిచర్డ్‌సన్, జోష్ ఇంగ్లీస్, స్వెప్సన్ బెంచ్‌కు పరిమితమయ్యారని ఫించ్ చెప్పుకొచ్చాడు.
ఇక మెగాటోర్నీలో సౌతాఫ్రికాకు కెప్టెన్ వ్యవహించడం గొప్పగౌరవంగా భావిస్తున్నానని ఆ జట్టు సారథి బావుమా తెలిపాడు. ఇది పెద్ద బాధ్యతని తెలిపాడు. ఇద్దరు స్పిన్నర్లతో పాటు కగిసో రబడా, అన్రిచ్ నోర్జ్‌లతో బరిలోకి దిగుతున్నామని, ఓ ఆల్ రౌండర్‌తో పాటు ఎక్స్‌ట్రా బ్యాట్స్‌మన్‌ను తీసుకున్నామని చెప్పాడు. ఈ టోర్నీ కోసం మేం అన్ని విధాలుగా సిద్దమయ్యాం. ఫేవరేట్ ట్యాగ్ గురించి ఆందోళన చెందడం లేదని చెప్పాడు.
సుదీర్ఘ కాలంపాటు క్రికెట్‌ను శాసించినా టీ20 ప్రపంచకప్ మాత్రం ఆస్ట్రేలియా జట్టుకు అందని ద్రాక్షే అయింది. ఆరు టోర్నీలను చూస్తే 2010లో ఫైనల్ చేరడం మినహా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఏదీ లేదు. ప్రస్తుత టీమ్‌లో ఓపెనర్లు వార్నర్, ఫించ్ పేలవ ఫామ్‌లో ఉండటం కలవరపెడుతుండగా... మిడిలార్డర్‌లో మ్యాక్స్‌వెల్, స్మిత్, స్టొయినిస్‌లను జట్టు నమ్ముకుంది.
మరోవైపు స్టార్లతో నిండి ఉన్నప్పుడు కూడా దక్షిణాఫ్రికా ఒక్కసారి కూడా ప్రపంచకప్‌లో ఫైనల్ చేరలేదు. ఇప్పుడు పెద్దగా అనుభవంలేని ఆటగాళ్లు ఎక్కువ మందితో కూడిన టీమ్ ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఆడే అవకాశం ఉండటం సానుకూలాంశం. ఇక ముఖాముఖి పోరులో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య 21 టి20 మ్యాచ్‌లు జరగ్గా.. అందులో 13 ఆస్ట్రేలియా.. 8 దక్షిణాఫ్రికా గెలిచింది. ఇక టి20 ప్రపంచకప్‌లలో ఆస్ట్రేలియా 29 మ్యాచ్‌ల్లో 16 విజయాలు.. 13 ఓటములు చవిచూసింది. ఇక దక్షిణాఫ్రికా టి20 ప్రపంచకప్‌లలో 30 మ్యాచ్‌ల్లో 18 గెలిచి.. 12 ఓడింది.
తుది జట్లు:
దక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), టెంబా బావుమా (కెప్టెన్), ఐడెన్ మార్క్రామ్, రాసీ వాన్ డెర్ డుసెన్, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్, డ్వైన్ ప్రిటోరియస్, కేశవ్ మహారాజ్, కాగిసో రబాడా, అన్రిచ్ నార్ట్జే, తబ్రేజ్ షమ్సీ
ఆస్ట్రేలియా : ఆరోన్ ఫించ్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, స్టీవెన్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్