
204 పరుగులకే ప్యాకప్..
15/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన సౌతాఫ్రికా 204 పరుగులకు కుప్పకూలింది. టెంబా బవుమా(65) మినహా అంతా విఫలమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ లియోన్ మూడు వికెట్లు తీయగా.. స్కాట్ బాండ్ రెండు వికెట్లు పడగొట్టాడు. మిచె స్టార్క్, ప్యాట్ కమిన్స్, స్టీవ్ స్మిత్‌లకు తలో వికెట్ దక్కింది.
ఈ మ్యాచ్‌లో ముందుబాగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 68.4 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. మార్కో జాన్సెన్ (59), వికెట్ కీపర్ కేల్ విరెన్నె (52) హాఫ్ సెంచరీలతో రాణించగా.. కామెరూన్ గ్రీన్ ఐదు వికెట్లతో సౌతాఫ్రికా పతనాన్ని శాసించాడు. మిచెల్ స్టార్క్‌కు 2 వికెట్లు దక్కాయి.

వార్నర్ డబుల్.. సఫారీ ట్రబుల్
అనంతరం ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 145 ఓవర్లలో 8 వికెట్లకు 575 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. డేవిడ్ వార్నర్ (255 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్లతో 200) డబుల్ సెంచరీతో చెలరేగగా.. స్టీవ్ స్మిత్ (85 ), ట్రావిస్ హెడ్ (51), కామెరూన్ గ్రీన్ (51) హాఫ్ సెంచరీలతో రాణించారు. అలెక్స్ క్యారీ( 111) సెంచరీకొట్టాడు. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన డేవిడ్ వార్నర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

టీమిండియాకు లైన్ క్లియర్..
కెరీర్‌లో 100వ టెస్టు ఆడుతూ డబుల్ సెంచరీ బాది 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' గెలిచిన రెండో ప్లేయర్‌గా డేవిడ్ వార్నర్ రికార్డుకెక్కాడు. ఇంతకుముందు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ ఈ ఫీట్ సాధించాడు. వచ్చే ఏడాది సిడ్నీ వేదికగా మూడో టెస్టు జరగనుంది. ఈ టెస్టు మ్యాచ్ గెలిస్తే ఆస్ట్రేలియా నేరుగా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌కి అర్హత సాధిస్తుంది. దీంతో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే టెస్టు సిరీస్‌లో టీమిండియా రెండు టెస్టులు గెలిచినా ఫైనల్‌కి చేరుతుంది.


Click it and Unblock the Notifications












