
మెల్‌బోర్న్: ఐపీఎల్ 2023 మినీ వేలంలో రూ.17.5 కోట్ల భారీ ధర పలికాననే ఉత్సాహమో ఏమో కానీ ఆస్ట్రేలియా పేస్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ దుమ్మురేపాడు. సౌతాఫ్రికాతో రెండో టెస్ట్‌లో గ్రీన్(5/27) ఐదు వికెట్లతో సౌతాఫ్రికా పతనాన్ని శాసించాడు. 10.4 ఓవర్లలో మూడు ఓవర్లు మెయిడిన్ చేసిన గ్రీన్..27 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. దాంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 68.4 ఓవర్లలో 189 పరుగులు మాత్రమే చేసింది.
కైల్ వెర్రెన్న్(99 బంతుల్లో 3 ఫోర్లతో 52), మార్కో జాన్సెన్(136 బంతుల్లో 10 ఫోర్లతో 59) హాఫ్ సెంచరీలతో టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో కామెరూన్ గ్రీన్‌కు తోడుగా మిచెల్ స్టార్క్ రెండు, స్కాట్ బొలాండ్, నాథన్ లియోన్ తలో వికెట్ తీసారు.
అనంతరం ఫస్ట్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 12 ఓవర్లలో 45 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా(1) విఫలమవ్వగా.. డేవిడ్ వార్నర్(32 నాటౌట్), మార్నస్ లబుషేన్(5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
ఆస్ట్రేలియా ఇంకా 144 పరుగుల వెనుకంజలో ఉంది. మూడు టెస్ట్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్ ఓడిన సౌతాఫ్రికా.. సిరీస్‌లో నిలవాలంటే ఈ మ్యాచ్ గెలవడం ముఖ్యం. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలన్నా ప్రతీ మ్యాచ్ గెలవడం ఆ జట్టుకు ముఖ్యం. సౌతాఫ్రికా ఫలితాలపై టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. డబ్ల్యూటీసీ పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఆసీస్ తొలి స్థానంలో, సౌతాఫ్రికా మూడో స్థానంలో ఉన్నాయి.
ఫైనల్‌కు చేరే క్రమంలో భారత్‌కు సఫారీల నుంచి గట్టి పోటీనే ఎదురుకానుంది. దీంతో రోహిత్ సేన ఆసీస్‌తో రాబోయే నాలుగు టెస్టుల సిరీస్‌ను 4-0తో గెలిస్తే ఢోకా ఉండదు. అప్పుడు విజయాల శాతం 68.05గా ఉంటుంది కాబట్టి దక్షిణాఫ్రికా తమకు మిగిలిన 4 టెస్టులను గెలిచినా ఫైనల్‌కు చేరుకోదు. ఒకవేళ భారత్ 3-0తో సిరీస్ సాధించి అటు సఫారీలు తమకు మిగిలిన అన్ని టెస్టులను గెలిస్తే మనోళ్లకు అవకాశం ఉండదు. మరోవైపు ప్రస్తుతం సాతాఫ్రికాతో మిగిలిన రెండు టెస్టులను కనుక గెలిస్తే ఆసీస్ జట్టు డబ్ల్యుటీసీ ఫైనల్లో అడుగుపెడుతుంది. ఈ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేస్తే.. భారత్‌తో జరగనున్న 4 టెస్ట్‌ల సిరీస్‌తో సంబంధం లేకుండా ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది.
ఐపీఎల్ 2023 మినీ వేలంలో కామెరూన్ గ్రీన్‌ను ముంబై ఇండియన్స్ రూ.17.50 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. 15 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన రెండో ప్లేయర్‌గా కామెరూన్ గ్రీన్ చరిత్ర కెక్కాడు. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ రూ.18.50 కోట్లకు అమ్ముడుపోయి అగ్రస్థానంలో ఉన్న విషయం తెలిసిందే.