Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

AUS vs SA:మ్యాచ్ మధ్యలో సిగరేట్ లైటర్ అడిగిన లబుషేన్.. నవ్వులే నవ్వులు!(వీడియో)

AUS vs SA: Marnus Labuschagne signals for cigarette lighter goes viral

సిడ్నీ: ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ మధ్యలో ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్ సిగరేట్ లైటర్ అడగటం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ విచిత్ర ఘటనతో కామెంట్రీ బాక్స్‌లో నవ్వులు పూసాయి. అసలు ఏం జరుగుతుందో? అని అంపైర్లు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. సిగరేట్ కాల్చడం కోసం లైటర్ అడుగుతున్నాడా? అని పరేషాన్ అయ్యారు.

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సందర్భంగా బ్యాటింగ్ చేస్తూ మార్నస్ లబుషేన్ కాస్త అసౌకర్యంగా కనిపించాడు. పదే పదే హెల్మెట్ తీస్తూ బ్యాటింగ్ చేశాడు. కాసేపటి తర్వాత ఆసీస్ డ్రెస్సింగ్ రూమ్ వైపు సైగలు చేస్తూ సిగరేట్ లైటర్ తెవాలని సూచించాడు. దాంతో డగౌట్‌లో ఉన్న ఆటగాళ్లతో పాటు అంపైర్లు, కామెంటేటర్లు అవాక్కయ్యారు. టీవీ కెమెరాలు కూడా మార్నస్ లబుషేన్‌ను క్లోజప్ చేయగా.. సిగరెట్ కాల్చే లైటర్ కావాలంటూ సైగ చేశాడు. ఆ తర్వాత హెల్మెట్ కోసం కావాలని సూచించాడు. ముందుగా లబుషేన్ విన్నపాన్ని గ్రహించలేకపోయిన ఆసీస్ ఆటగాళ్లు.. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకొని లైటర్ తీసుకొచ్చారు. ఇక లబుషేన్ హెల్మెట్ లోపలి భాగాన్ని లైటర్‌తో కాలుస్తూ దాన్ని రిపేర్ చేశాడు. తొలి రోజు ఆటలో లబుషేన్ వ్యవహారం హైలైట్‌గా నిలిచింది.

వర్షం అంతరాయంతో పాటు వెలుతురు లేమి కారణంగా తొలి రోజు47 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లకు 147 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖాజా(121 బంతుల్లో 6 ఫోర్లతో 54 బ్యాటింగ్), మార్నస్ లబుషేన్(151 బంతుల్లో 13 ఫోర్లతో 79) హాఫ్ సెంచరీలతో రాణించారు. డేవిడ్ వార్నర్(10) విఫలమయ్యాడు. సౌతాఫ్రికా బౌలర్లలో అన్రిచ్ నోర్జ్ రెండు వికెట్లు తీసాడు.

Story first published: Wednesday, January 4, 2023, 19:55 [IST]
Other articles published on Jan 4, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+