For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

AUS vs SA: పట్టుబిగించిన ఆస్ట్రేలియా.. ఓటమి దిశగా సౌతాఫ్రికా!

AUS vs SA: Aussies take complete control of MCG Test, South Africa trail by 371 runs

మెల్‌బోర్న్: మూడు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికా‌తో జరుగుతున్న రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పట్టు బిగించింది. 386/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్‌లో 575/8 భారీ స్కోర్ వద్ద డిక్లేర్ ఇచ్చింది. అలెక్స్ క్యారీ(149 బంతుల్లో 13 ఫోర్లతో 111) సెంచరీ సాధించగా.. కామెరూన్ గ్రీన్(51 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో నిలిచాడు.

రెండో రోజు ఆటలో డేవిడ్ వార్నర్(255 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్స్‌లతో 200) డబుల్ సెంచరీ బాదగా.. స్టీవ్ స్మిత్(85) సెంచరీ చేజార్చుకున్నాడు. సౌతాఫ్రికా బౌలర్లలో కగిసో రబడా రెండు వికెట్లు తీయగా.. అన్రిచ్ నోర్జే మూడు వికెట్లు పడగొట్టారు. లుంగి ఎంగిడి, మార్కో జాన్సెన్ తలో వికెట్ తీసారు. రిటైర్ట్ హర్ట్‌గా వెనుదిరిగి మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చిన వార్నర్ ఒక్క పరుగు కూడా చేయకుండానే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. గ్రీన్ మాత్రం హాఫ్ సెంచరీతో చెలరేగాడు.

AUS vs SA: Aussies take complete control of MCG Test, South Africa trail by 371 runs

తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 189 పరుగులకు కుప్పకూలిన విషయం తెలిసిందే. దాంతో ఆసీస్‌కు 386 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఈ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా ఆదిలోనే కెప్టెన్ డీన్ ఎల్గర్(0) వికెట్ కోల్పోయింది. కమిన్స్ ధాటికి ఎల్గర్ బ్రాంజ్ డక్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో సరెల్ ఎర్వీ(7 బ్యాటింగ్), డీ బ్రూన్(6 బ్యాటింగ్) ఉండగా.. వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు ఆటను నిలిపేసి మూడో రోజును ముగించారు. దాంతో సౌతాఫ్రికా 15/1తో నిలిచింది.

సంక్షిప్త స్కోర్లు..

సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 189 ఆలౌట్

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 575/8 డిక్లేర్డ్

సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ 15/1

Story first published: Wednesday, December 28, 2022, 13:07 [IST]
Other articles published on Dec 28, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+