For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

AUS vs PAK: ఉసామా.. నీ అవ్వ తగ్గేదేలే! డేవిడ్ వార్నర్ ట్రేడ్ మార్క్ సెలెబ్రేషన్స్! (వీడియో)

వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (David Warner), మిచెల్ మార్ష్ సెంచరీలతో చెలరేగారు. ఈ మెగా టోర్నీలో ఇద్దరు ఓపెన్లరు సెంచరీ చేయడం ఇదే తొలి సారి. ముందుగా డేవిడ్ వార్నర్ 82 బంతుల్లో సెంచరీ సాధించగా.. ఆ మరుసటి బంతికే మిచెల్ మార్ష్ బౌండరీ బాది 100 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు.

ఈ ఇద్దరూ సెంచరీలతో కదం తొక్కడంతో ఆస్ట్రేలియా భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. సెంచరీ పూర్తయిన అనంతరం డేవిడ్ వార్నర్.. పుష్ప ట్రేడ్ మార్క్ సెలెబ్రేషన్స్ చేసుకున్నాడు. 'నీ అవ్వ తగ్గేదేలే'అంటూ సైగలు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు.

AUS vs PAK, World Cup 2023: David Warner Celebrates his Century In Pushpa Style

ఇన్నింగ్స్ ఆరంభంలో షాహిన్ అఫ్రిది వేసిన ఐదో ఓవర్ మూడో బంతికే డేవిడ్ వార్నర్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాల్సింది. అతను ఇచ్చిన లాలిపాప్ క్యాచ్‌ను మిడాన్‌లో ఉసామా మీర్ నేలపాలు చేశాడు. చేతుల్లోకి వచ్చిన క్యాచ్‌ను వదిలేసాడు. అప్పటికే వార్నర్ చేసింది 10 పరుగులు మాత్రమే. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న వార్నర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

పాకిస్థాన్‌కు చేయాల్సిన నష్టం చేశాడు. ఈ క్రమంలోనే వార్నర్.. 'ఉసామా.. నీ అవ్వ తగ్గేదేలే'అని అన్నాడని ఫ్యాన్స్ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఉసామా మీర్ చెత్త ఫీల్డింగ్‌పై మండిపడుతున్నారు. లాగాన్ సినిమా పిక్స్‌తో ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తూ నవ్వులు పూయిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంత ఈజీ క్యాచ్‌ను ఎవరు వదిలేయరని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఏళ్లు గడిచినా.. ఆటగాళ్లు.. కెప్టెన్లు మారినా పాకిస్థాన్ ఫీల్డింగ్ మాత్రం మెరుగవ్వడం లేదని సెటైర్లు పేల్చుతున్నారు. వార్నర్, మిచెల్ మార్ష్ సూపర్ బ్యాటింగ్‌తో తొలి వికెట్‌కు 259 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు అయ్యింది. షాహిన్ అఫ్రిది వరుస బంతుల్లో మిచెల్ మార్ష్(121), గ్లేన్ మ్యాక్స్‌వెల్(0)లనును పెవిలియన్ చేర్చాడు. స్టీవ్ స్మిత్‌ను ఉసామా మీర్ రిటర్న్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చడంతో ఆసీస్ 284 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.

Story first published: Friday, October 20, 2023, 17:12 [IST]
Other articles published on Oct 20, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+