Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

AUS vs PAK: పోలీస్ అత్యుత్సాహం.. తిరగబడ్డ పాకిస్థాన్ ఫ్యాన్ (వీడియో)

AUS vs PAK: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. బెంగళూరు వేదికగా జరుగుతున్న మ్యాచ్‌కు హాజరైన ఓ పాకిస్థాన్ అభిమాని పట్ల మ్యాచ్ భద్రత కోసం వచ్చిన ఓ పోలీస్ అధికారి అనుచితంగా ప్రవర్తించాడు.

తన దేశానికి మద్దతు తెలుపున ఆ అభిమానిని అ కారణంగా అడ్డుకున్నాడు. ఇండియన్ ఫ్యాన్స్‌తో నిండిపోయిన ఈ మైదానంలో 'పాకిస్థాన్ జిందాబాద్'అంటూ నినాదాలు చేసిన సదరు పాక్ అభిమానిని పోలీస్ అధికారి అడ్డుకున్నాడు. పాకిస్థాన్ జిందాబాద్ అనడానికి వీలు లేదని చెప్పాడు. ఇది భారత్ మ్యాచ్ అనుకున్నాడో.. లేక పాకిస్థాన్‌పై ఉన్న ద్వేషమో తెలియదు కానీ సదరు పోలీస్ అధికారి పాకిస్థాన్ జిందాబాద్ అనే నినాదాలను జీర్ణించుకోలేకపోయాడు.

AUS vs PAK: Policeman stops Pakistani fan from chanting Pakistan Zindabad during CWC 2023 match

పోలీస్ అధికారి అనుచిత ప్రవర్తనతో ఖంగుతిన్న సదరు అభిమాని గట్టిగా నిలదీసాడు. 'నా దేశానికి, మా జట్టుకు మద్దతు తెలిపే అధికారం లేదా?'అని ప్రశ్నించాడు. భారత్ జిందాబాద్ అనే నినాదాలను కూడా అడ్డుకొవాలని కోరాడు. సదరు అభిమాని గట్టిగా మాట్లాడటంతో అక్కడికి వచ్చిన మ్యాచ్ నిర్వాహకులు అతనికి క్షమాపణలు చెప్పి సదరు పోలీస్ అధికారిని అక్కడి నుంచి పంపించేసారు.

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు అత్యుత్సాహం కారణంగా భారత్‌కు, బీసీసీఐ చెడ్డ పేరు వస్తుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే పాకిస్థాన్.. తమ అభిమానులు, జర్నలిస్ట్‌లకు వీసాలు ఇవ్వడం లేదని ఐసీసీకి ఫిర్యాదు చేసిందని, ఇలాంటి ఘటనలతో తమ వాదనను బలంగా వినిపిస్తోందని హెచ్చరిస్తున్నారు.

ఇంకొందరు మాత్రం సదరు పోలీస్ అధికారిని అభినందిస్తున్నారు. ఆ అభిమాని పాకిస్థాన్ కాదని, భారత్‌కు చెందినవాడేనని కామెంట్ చేస్తున్నారు. సొంత దేశంలో ఉంటూ శతృదేశాన్ని ప్రేమించేవారిని ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 367 పరుగుల భారీ స్కోర్ చేసింది. డేవిడ్ వార్నర్(124 బంతుల్లో 14 ఫోర్లు, 9 సిక్స్‌లతో 163), మిచెల్ మార్ష్(108 బంతుల్లో 10 ఫోర్లు, 9 సిక్సర్లతో 121) సెంచరీలతో చెలరేగారు. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది(5/52) ఐదు వికెట్లతో రాణించగా.. హ్యారీస్ రౌఫ్(3/83) మూడేసి వికెట్లు తీసాడు. ఉసామా మీర్(1/82) కు ఓ వికెట్ దక్కింది.

Story first published: Friday, October 20, 2023, 20:55 [IST]
Other articles published on Oct 20, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+