For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

AUS vs PAK: పాకిస్థాన్ చెత్త ఫీల్డింగ్.. ఒక్క బంతికి 5 పరుగులు! బౌండరీ లేకుండా (వీడియో)

పాకిస్థాన్ క్రికెట్ టీమ్ ఫీల్డింగ్ ఎంత నాసిరకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏళ్లు గడుస్తున్నా.. తరాలు మారుతున్నా.. కొత్త ఆటగాళ్లు వస్తున్నా ఆ జట్టు ఫీల్డింగ్ మాత్రం మారడం లేదు. ఒక్క క్యాచ్ కోసం ఇద్దరు పరుగెత్తి ఎవరూ పట్టకుండా వదిలేయడం... బౌండరీ ఆపబోయి కాలితో తన్నడం.. సునాయస రనౌట్లు, స్టంపౌట్స్ చేజార్చడం, చేతుల్లోకి వచ్చిన లడ్డూ లాంటి క్యాచ్‌లు నేలపాలు చేయడం.. గ్లోవ్స్ సాయంతో కూడా కీపర్స్ క్యాచ్‌లు పట్టలేకపోవడం.. వంటి ఎన్నో విన్యాసాలను పాకిస్థాన్ క్రికెట్ జట్టులో చూస్తూనే ఉన్నాం.

తాజాగా ఆ జట్టు అనవసరపు ఓవర్‌త్రోలతో ఒక్క బంతికి 5 పరుగులు సమర్పించుకుంది. బౌండరీ, ఎక్స్‌ట్రా డెలివరీ వేయకుండా ఓవర్‌త్రోలతో ఈ పరుగులిచ్చింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. పాకిస్థాన్ చెత్త ఫీల్డింగ్‌‌ను ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ క్యాష్ చేసుకున్నాడు.

AUS vs PAK: Pat Cummins scores 5 runs in 1 delivery without any boundaries or no ball

వికెట్ల మధ్య ఐదు పరుగులు తీసాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్రికెట్ ఆస్ట్రేలియా ఎక్స్‌వేదికగా షేర్ చేయగా నెట్టింట వైరల్‌గా మారుతోంది. పాకిస్థాన్ బౌలర్ అమెర్ జమాల్ వేసిన 75వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ మూడో బంతిని పాకిస్థాన్.. కవర్స్ వైపు ఆడి క్విక్ డబుల్ తీయగా.. బంతిని అందుకున్న ఫీల్డర్ నాన్‌స్ట్రైకర్ వైపు వేసాడు.

అయితే అమెర్ జమాల్ బంతిని అందుకోవడంలో విఫలమయ్యాడు. దాంతో బంతి బౌండరీ లైన్ వరకు వెళ్లగా.. ఇమామ్ ఉల్ హక్ అడ్డుకున్నాడు. కానీ అప్పటికే కమిన్స్, క్యారీ మరో మూడు పరుగులు తీశారు. దాంతో ఆస్ట్రేలియాకు బౌండరీ, ఎక్స్‌ట్రాల సాయం లేకుండా ఒక్క బంతికే 5 పరుగులు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోపై జోకులు పేలుతున్నాయి. పాకిస్థాన్ ఫీల్డింగ్ తీరును నెటిజన్లు తప్పుబడుతున్నారు.

ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం దిశగా సాగుతోంది. 317 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన పాకిస్థాన్ 162 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కెప్టెన్ షాన్ మసూద్(71 బంతుల్లో 7 ఫోర్లతో 60), బాబర్ ఆజామ్(79 బంతుల్లో 4 ఫోర్లతో 41)మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. క్రీజులో మహమ్మద్ రిజ్వాన్(14 బ్యాటంగ్), అఘా సల్మాన్(4 బ్యాటింగ్) ఉన్నారు. ఆసీస్ విజయానికి 5 వికెట్లు అవసరమవ్వగా.. పాకిస్థాన్ ఇంకా 150 పరుగులు చేయాలి.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 318 పరుగులకు ఆలౌటైంది. అనంతరం పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 264 పరుగులే చేసింది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో మిచెల్ మార్ష్(96) మెరుపు బ్యాటింగ్‌తో 262 రన్స్ చేసింది.

Story first published: Friday, December 29, 2023, 11:25 [IST]
Other articles published on Dec 29, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+