Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

AUS vs PAK: నిప్పులు చెరిగిన ప్యాట్ కమిన్స్.. క్లీన్ స్వీప్ అయిన పాకిస్థాన్!

పాకిస్థాన్‌తో సొంతగడ్డపై జరిగిన రెండు టెస్ట్‌ల సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-0తో కైవసం చేసుకుంది. శుక్రవారం ముగిసిన రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా 79 పరుగుల తేడాతో గెలుపొందింది. 317 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్.. 237 రన్స్‌కు కుప్పకూలింది.

షాన్ మసూద్(71 బంతుల్లో 7 ఫోర్లతో 60), అఘా సల్మాన్(70 బంతుల్లో 6 ఫోర్లతో 50) హాఫ్ సెంచరీలతో రాణించగా.. బాబర్ ఆజామ్(79 బంతుల్లో 4 ఫోర్లతో 41) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అమెర్ జమాల్, షాహిన్ షా అఫ్రిది, మిర్ హమ్‌జా డకౌటయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ప్యాట్ కమిన్స్(5/49) మరోసారి ఐదు వికెట్లతో నిప్పులు చెరగగా.. మిచెల్ స్టార్క్(4/55) నాలుగు వికెట్లు పడగొట్టాడు. జోష్ హజెల్ వుడ్‌కు ఓ వికెట్ దక్కింది.

AUS vs PAK: Pat Cummins Bags 10-For As Australia Beat Pakistan To Clinch Series

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 318 పరుగులకు ఆలౌటైంది. మార్నస్ లబుషేన్(155 బంతుల్లో 5 ఫోర్లతో 63) హాఫ్ సెంచరీతో రాణించగా.. డేవిడ్ వార్నర్(38), ఉస్మాన్ ఖవాజా(42), మిచెల్ మార్ష్ (41) కీలక ఇన్నింగ్స్ ఆడారు. పాకిస్థాన్ బౌలర్లలో అమెర్ జమాల్ మూడు వికెట్లు తీయగా.. షాహిన్ షా అఫ్రిది, మిర్ హమ్‌జా, హసన్ అలీ తలో రెండు వికెట్లు పడగొట్టారు. అఘా సల్మాన్ ఓ వికెట్ తీసాడు.

అనంతరం పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 264 పరుగులే చేసింది. ఓపెనర్ అబ్దుల్ షఫీక్(109 బంతుల్లో 5 ఫోర్లతో 62), కెప్టెన్ షాన్ మసూద్(76 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 54) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మహమ్మద్ రిజ్వాన్(51 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 42) పర్వాలేదనిపించాడు. ఆసీస్ బౌలర్లలో ప్యాట్ కమిన్స్(5/48) ఐదు వికెట్లు తీయగా.. నాథన్ లయన్(4/73) నాలుగు వికెట్లు పడగొట్టాడు. జోష్ హజెల్ వుడ్‌కు ఓ వికెట్ దక్కింది.

ఇక ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో మిచెల్ మార్ష్(96) మెరుపు బ్యాటింగ్‌తో 262 రన్స్ చేసింది. అలెక్స్ క్యారీ(101 బంతుల్లో 8 ఫోర్లతో 53), స్టీవ్ స్మిత్(176 బంతుల్లో 3 ఫోర్లతో 50) హాఫ్ సెంచరీలతో రాణించారు. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది, మిర్ హమ్‌జా నాలుగేసి వికెట్లు తీయగా.. అమెర్ జమాల్ రెండు వికెట్లు పడగొట్టాడు.

Story first published: Friday, December 29, 2023, 14:47 [IST]
Other articles published on Dec 29, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+