Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

AUS vs PAK: నిప్పులు చెరిగిన ప్యాట్ కమిన్స్.. ఆలౌట్ దిశగా పాకిస్థాన్!

పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా పట్టు బిగించింది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్(3/37) నిప్పులు చెరగడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 55 ఓవర్లలో 6 వికెట్లకు 194 పరుగులు చేసింది. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్(109 బంతుల్లో 5 ఫోర్లతో 62), షాన్ మసూద్(76 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 54) హాఫ్ సెంచరీలతో రాణించగా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.

బాబర్ ఆజామ్(1), ఇమామ్ ఉల్ హక్(10), సౌద్ షకీల్(9), అఘా సల్మాన్(5) దారుణంగా విఫలమయ్యారు. క్రీజులో మహమ్మద్ రిజ్వాన్(29 బ్యాటింగ్), ఆమెర్ జమాల్(2 బ్యాటింగ్) ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ప్యాట్ కమిన్స్ మూడు వికెట్లకు తోడుగా.. నాథన్ లయన్ రెండు వికెట్లు పడగొట్టాడు. జోష్ హజెల్ వుడ్‌కు ఓ వికెట్ దక్కింది.

 AUS vs PAK: Pat Cummins and Nathan Lyon give hosts edge in second Test

అంతకుముందు 187/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా 318 పరుగులకు కుప్పకూలింది. మార్నస్ లబుషేన్(155 బంతుల్లో 5 ఫోర్లతో 63) హాఫ్ సెంచరీ‌తో సత్తా చాటగా.. ఉస్మాన్ ఖవాజా(42), మిచెల్ మార్ష్(41), డేవిడ్ వార్నర్(38) కీలక ఇన్నింగ్స్ ఆడారు. పాకిస్థాన్ బౌలర్లలో అమెర్ జమాల్ మూడు వికెట్లు తీయగా.. హసన్ అలీ, మిర్ హమ్‌జా, షాహిన్ షా అఫ్రిది రెండేసి వికెట్లు తీసారు.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన పాకిస్థాన్‌కు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. నాథన్ లయన్ బౌలింగ్‌లో ఇమామ్ ఉల్ హక్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఈ పరిస్థితుల్లో అబ్దుల్లా షఫీక్, షాన్ మసూద్ జట్టును ఆదుకున్నారు. 90 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని కమిన్స్ విడదీసాడు.

సెంచరీ దిశగా సాగుతున్న అబ్దుల్లా షఫీక్(62)ను రిటర్న్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే బాబర్ ఆజామ్‌(1)ను స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ బాల్‌కు బాబర్ ఆజామ్ బిత్తరపోయాడు. సౌద్‌షకీల్(9)ను హజెల్ వుడ్ క్లీన్ బౌల్డ్ చేయగా.. అఘా సల్మాన్‌ను కమిన్స్ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు.

Story first published: Wednesday, December 27, 2023, 19:42 [IST]
Other articles published on Dec 27, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+