For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

AUS vs PAK: కొంపముంచిన చెత్త ఫీల్డింగ్.. పాకిస్థాన్ ముందు భారీ లక్ష్యం!

ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్థాన్: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్లు దుమ్ము రేపారు. డేవిడ్ వార్నర్(124 బంతుల్లో 14 ఫోర్లు, 9 సిక్స్‌లతో 163), మిచెల్ మార్ష్(108 బంతుల్లో 10 ఫోర్లు, 9 సిక్సర్లతో 121) సెంచరీలతో కదం తొక్కారు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 367 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ ఇద్దరూ బ్యాటర్లు మినహా మిగతా ఆసీస్ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.

పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది(5/52) ఐదు వికెట్లతో సత్తా చాటగా.. హ్యారీస్ రౌఫ్(3/83) మూడేసి వికెట్లు తీయగా.. ఉసామా మీర్(1/82) ఓ వికెట్ తీసాడు. పాకిస్థాన్ చెత్త ఫీల్డింగ్ ఆసీస్ బ్యాటర్లకు కలిసొచ్చింది.

AUS vs PAK: Pakistan restrict Australia to 367/9 after Warner, Marsh assault in CWC 2023

లడ్డూలాంటి క్యాచ్..
ఇన్నింగ్స్ ఆరంభంలో 10 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద డేవిడ్ వార్నర్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను ఉసామా మీర్ నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో ఆకాశమే హద్దుగా చెలరేగిన వార్నర్ విధ్వంసకర సెంచరీతో విరుచుకుపడ్డాడు. సెంచరీ అనంతరం అతను ఇచ్చిన మరో క్యాచ్‌ను డీప్ మిడ్ వికెట్‌లో అబ్దుల్లా షఫీక్ నేలపాలు చేశాడు.

ఆ సమయంలో వార్నర్ 105 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. రెండో ఛాన్స్ అతను మరో 58 పరుగులు చేశాడు. ఈ రెండు క్యాచ్‌లు నేలపాలు చేసి పాకిస్థాన్ తగిన మూల్యం చెల్లించుకుంది. ముఖ్యంగా ఉసామా మిర్ వదిలేసిన లాలీ పాప్ క్యాచ్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

విధ్వంసకర ఆరంభం..
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు అదరిపోయే ఆరంభాన్ని అందించారు. పాకిస్థాన్ ఫీల్డింగ్ తప్పిదాలతో క్రీజులో సెట్ అయిన ఈ జోడీ ఆకాశమే హద్దుగా చెలరేగింది. 12.5 ఓవర్లలోనే 100 పరుగులు చేసిన ఆసీస్.. 29.2 ఓవర్లలో 200 పరుగులు పూర్తి చేసింది.

ఈ క్రమంలో ముందుగా డేవిడ్ వార్నర్ 82 బంతుల్లో సెంచరీ సాధించగా.. ఆ మరుసటి బంతికే మిచెల్ మార్ష్ బౌండరీ బాది 100 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు.

259 పరుగుల భారీ భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని షాహిన్ అఫ్రిది విడదీసాడు. వరుస బంతుల్లో మిచెల్ మార్ష్(121)తో పాటు గ్లేన్ మ్యాక్స్‌వెల్(0)లను పెవిలియన్ చేర్చాడు. స్టీవ్ స్మిత్‌ను ఉసామా మీర్ రిటర్న్ క్యాచ్‌గా వెనక్కి పంపడంతో ఆసీస్ పరుగుల వేగం తగ్గింది.

రఫ్ఫాడించిన షాహిన్..
మార్కస్ స్టోయినీస్(21) సాయంతో జట్టు స్కోర్ 300 ధాటించిన వార్నర్ హ్యారీస్ రౌఫ్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన జోష్ ఇంగ్లీస్(15), లబుషేన్(8), మిచెల్ స్టార్క్(2), జోష్ హజెల్ వుడ్(0)‌లు అఫ్రిది ధాటికి వరుసగా పెవిలియన్ చేరారు. దాంతో 400 స్కోర్ చేస్తుందనుకున్న ఆసీస్ 367 పరుగులకే పరిమితమైంది.

Story first published: Friday, October 20, 2023, 18:05 [IST]
Other articles published on Oct 20, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+