Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

AUS vs PAK: ఓటమి బాధలో ఉన్నపాకిస్థాన్‌కు బిగ్ షాక్!

AUS vs PAK: ఆస్ట్రేలియా పర్యటనను పాకిస్థాన్ ఓటమితో ప్రారంభించింది. మూడు టెస్ట్‌‌ల సిరీస్‌లో భాగంగా ఆతిథ్య జట్టుతో జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ 360 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ ఘోర పరాజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 0-1తో వెనుకంజలో నిలిచింది. ఇక ఈ ఓటమి బాధలో ఉన్న పాకిస్థాన్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది.

ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్‌కు కారణమైన ఆ జట్టుపై ఐసీసీ కొరడా ఝులిపించింది. పాకిస్థాన్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించడంతో పాటు డబ్ల్యూటీసీ పాయింట్స్‌లో రెండు పాయింట్లను తగ్గిస్తూ కఠిన చర్యలు తీసుకుంది. నిర్ణీత సమయం కన్నా పాకిస్థాన్ 2 ఓవర్లు తక్కువగా వేసినట్లు గుర్తించిన మ్యాచ్ రిఫరీ నిబంధనల మేరకు చర్యలు తీసుకున్నాడు.

AUS vs PAK: Pakistan penalized for slow over-rate in 1st Test against Australia

దాంతో పాకిస్థాన్ డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానం నుంచి రెండో స్థానానికి పడిపోయింది. పాకిస్థాన్ విన్నింగ్ పర్సంటేజ్ 66.67 నుంచి 61.11కు పడిపోయింది.ఐసీసీ రూల్స్‌లోని ఆర్టికల్ 2.22 ప్రకారం నిర్ణీత సమయంలోపు ఓవర్లను పూర్తి చేయకపోతే.. జట్టులోని ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో ఓవర్‌కు చొప్పున 5 శాతం కోత విధిస్తారు. పాకిస్థాన్ రెండు ఓవర్లు తక్కువగా వేయడంతో 10 శాతం కోత విధించారు.

ఆర్టికల్ 16.11.2‌లోని డబ్ల్యూటీసీ ప్లేయింగ్ కండిషన్స్ ప్రకారం ఓవర్ చొప్పున ఒక పాయింట్‌ను కోత విధిస్తారు. స్లో ఓవర్ రేట్ టైమ్ అభియోగాలను ఫీల్డ్ అంపైర్లు జోయెల్ విల్సన్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్‌లు కూడా అంగీకరించడంతో మ్యాచ్ రిఫరీ జగవళ్ శ్రీనాథ్ చర్యలు తీసుకున్నారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 487 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (164), మిచెల్ మార్ష్ (90) సత్తా చాటారు. అనంతరం పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 271 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్లు ఇమాముల్ హక్ (62), షఫీకి (42) మినహా అంతా విఫలమయ్యారు. నాథన్ లయాన్ మూడు వికెట్లు, కమిన్స్ రెండు వికెట్లు తీశారు.

216 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా 233/ 5 స్కోరు వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఖవాజా (90), మిచెల్ మార్ష్ (63*) రాణించారు. అనంతరం 450 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 89 పరుగులకే కుప్పకూలింది. సౌద్ షకిల్ (24) టాప్ స్కోరర్. స్టార్క్, హేజిల్‌వుడ్ మూడు వికెట్లు, లయాన్ రెండు వికెట్లు తీశారు.

Story first published: Monday, December 18, 2023, 19:22 [IST]
Other articles published on Dec 18, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+