AUS vs PAK: పాకిస్థాన్‌కు ఘోర పరాజయం!
సొంతగడ్డపై పాకిస్థాన్‌కు ఘోర పరాజయం ఎదురైంది. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా లాహోర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో సమష్టిగా విఫలమైన పాకిస్థాన్ 41 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దాంతో మూడు వన్డేల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 231 పరుగులు చేసింది. జోష్ ఇంగ్లీస్(74 బంతుల్లో 5 ఫోర్లతో 51), కామెరూన్ గ్రీన్(92 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మ్యాట్ రేన్‌షా(43 బంతుల్లో 3 ఫోర్లతో 43) పర్వాలేదనిపించాడు. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది మూడు వికెట్లు తీయగా.. హారిస్ రౌఫ్, మిన్‌హాస్, అబ్రార్ అహ్మద్, రెండేసి వికెట్లు పడగొట్టారు.

అనంతరం పాకిస్థాన్ 44 ఓవర్లలో 190 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. షాదాబ్ ఖాన్(104 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 71) అరఫత్ మిన్హాస్(33), ఘాజి ఘోరి(37) పోరాడినా ఫలితం లేకపోయింది.
ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ ఎల్లిస్(4/33), మాథ్యూ షార్ట్(3/36) పాక్ పతనాన్ని శాసించగా.. మాథ్యూ కుహ్నెమన్, ఆడమ్ జంపా, తన్వీ సంగా తలో వికెట్ తీసారు. ఇరు జట్ల మధ్య మూడో వన్డే గురువారం లాహోర్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు సిరీస్ దక్కనుంది.
కొంపముంచి టాపార్డర్ వైఫల్యం..
232 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్థాన్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. టాప్-3 బ్యాటర్లు షాహిబ్‌జాద ఫర్హాన్(3), మాజ్ సదాకత్(0), బాబర్ ఆజామ్(16) తీవ్రంగా నిరాశపర్చారు. ఘాజీ ఘోరి(37) కాస్త పోరాడినా.. మరో ఎండ్‌లో సల్మాన్ అఘా(7), అబ్దుల్ సమద్(2) వరుసగా పెవిలియన్ చేరారు. దాంతో పాక్ 58 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఆ కాసేపటికే ఘాజీ ఘోరి కూడా ఔటవ్వడంతో ఆ జట్టు కష్టాలు రెట్టింపు అయ్యాయి. షాదాబ్ ఖాన్, అరఫత్ మినహాస్ పోరాడినా ఫలితంలేకపోయింది. కెప్టెన్ షాహిన్ షా అఫ్రిది(0), హారిస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్(0) విఫలమవడంతో పాకిస్థాన్ 190 పరుగులకే పరిమితమైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

