For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

AUS VS PAK: మార్కస్ స్టోయినీస్ ఊచకోత.. పాకిస్థాన్ క్లీన్ స్వీప్!

ఆస్ట్రేలియా పర్యటనను పాకిస్థాన్ ఘోర పరాజయంతో ముగించింది. మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో గెలుచుకున్న పాకిస్థాన్.. మూడు టీ20ల సిరీస్‌లో మాత్రం 3-0తో క్లీన్ స్వీప్ అయ్యింది.

సోమవారం ముగిసిన మూడో టీ20లో ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బౌలర్ల అసాధారణ ప్రదర్శనతో పాటు మార్కస్ స్టోయినీస్(27 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 61 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆసీస్ గెలుపొందింది.

AUS VS PAK Marcus Stoinis helps Australia beat Pakistan in 3rd T20I win series 3-0

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 18.1 ఓవర్లలో 117 పరుగులకు కుప్పకూలింది. బాబర్ ఆజామ్(28 బంతుల్లో 4 ఫోర్లతో 41) ఒక్కడే రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో ఆరోన్ హార్డీ(3/21) మూడు వికెట్లు తీయగా.. ఆడమ్ జంపా(2/11), స్పెన్సర్ జాన్సన్(2/24) రెండేసి వికెట్లు తీసారు. గ్జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్ తలో వికెట్ తీసారు.

అనంతరం ఆస్ట్రేలియా 11.2 ఓవర్లలో 3 వికెట్లకు 118 పరుగులు చేసి 52 బంతులు మిగిలి ఉండగానే సునాయస విజయాన్నందుకుంది. మార్కస్ స్టోయినీస్‌తో పాటు జోష్ ఇంగ్లీస్(24 బంతుల్లో 4 ఫోర్లతో 27) రాణించారు. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది, జహందాద్ ఖాన్, అబ్బాస్ అఫ్రిది తలో వికెట్ తీసారు.

Story first published: Monday, November 18, 2024, 17:15 [IST]
Other articles published on Nov 18, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+