Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

AUS vs PAK: రఫ్ఫాడించిన ఆడమ్ జంపా.. గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిన పాకిస్థాన్!

ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్థాన్: వన్డే ప్రపంచకప్ 2023లో పాకిస్థాన్‌కు మరో ఓటమి ఎదురైంది. బెంగళూరు వేదికగా శుక్రవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై 62 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. బ్యాటింగ్‌లో డెవిడ్ వార్నర్ దుమ్ము రేపగా.. బౌలింగ్‌లో ఆడమ్ జంపా(4/53) రఫ్ఫాడించాడు.

మరోవైపు పేలవ ఫీల్డింగ్, చెత్త బ్యాటింగ్‌తో గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 367 పరుగుల భారీ స్కోర్ చేసింది. డేవిడ్ వార్నర్(124 బంతుల్లో 14 ఫోర్లు, 9 సిక్స్‌లతో 163), మిచెల్ మార్ష్(108 బంతుల్లో 10 ఫోర్లు, 9 సిక్సర్లతో 121) సెంచరీలతో చెలరేగారు.

AUS vs PAK: David Warner’s hundred, Adam Zampa’s 4-fer power Australia to win vs Pakistan in CWC 2023

పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది(5/52) ఐదు వికెట్లతో సత్తా చాటగా.. హ్యారీస్ రౌఫ్(3/83) మూడేసి వికెట్లు తీయగా.. ఉసామా మీర్(1/82) ఓ వికెట్ తీసాడు. పాకిస్థాన్ చెత్త ఫీల్డింగ్ ఆసీస్ బ్యాటర్లకు కలిసొచ్చింది.

10 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద డేవిడ్ వార్నర్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను ఉసామా మీర్ నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో ఆకాశమే హద్దుగా చెలరేగిన వార్నర్ విధ్వంసకర సెంచరీతో విరుచుకుపడ్డాడు. సెంచరీ అనంతరం అతను ఇచ్చిన మరో క్యాచ్‌ను డీప్ మిడ్ వికెట్‌లో అబ్దుల్లా షఫీక్ నేలపాలు చేశాడు. నేలపాలైన ఈ రెండు క్యాచ్‌లు పాక్ విజయవకాశాలను దెబ్బతీసాయి.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ 45.3 ఓవర్లలో 305 పరుగులకు కుప్పకూలింది. అబ్దుల్లా షఫీక్(61 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 64), ఇమామ్ ఉల్ హక్(71 బంతుల్లో 10 ఫోర్లతో 70) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా నాలుగు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్, మార్కస్ స్టోయినీస్ రెండేసి వికెట్లు పడగొట్టారు. మిచెల్ స్టార్క్, జోష్ హజెల్ వుడ్ తలో వికెట్ తీసారు.

ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన డేవిడ్ వార్నర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. పాకిస్థాన్ తమ తదుపరి మ్యాచ్‌ను అఫ్గానిస్థాన్‌తో ఆడనుంది.

Story first published: Friday, October 20, 2023, 22:25 [IST]
Other articles published on Oct 20, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+