Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

AUS vs PAK: కన్నీటి పర్యంతమైన డేవిడ్ వార్నర్ (వీడియో)

ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సుదీర్ఘ ఫార్మాట్‌లో తన చివరి మ్యాచ్ ఆడేశాడు. సొంతగడ్డపై పాకిస్థాన్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్ ప్రారంభానికి ముందే రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించిన వార్నర్.. ఈ సిరీస్‌తో తన 13 ఏళ్ల సుదీర్ఘ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతానని వెల్లడించాడు.

సిడ్నీ వేదికగా శనివారం ముగిసిన మూడో టెస్ట్‌లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో మూడు టెస్ట్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్ చివరి ఇన్నింగ్స్‌లో డేవిడ్ వార్నర్(75 బంతుల్లో 7 ఫోర్లతో 57) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.

AUS vs PAK: David Warner Gets Emotional During His Farewell Speech

ఈ ఫేర్‌వెల్ సిరీస్‌ ఫస్ట్ మ్యాచ్‌లోనే శతక్కొట్టిన వార్నర్.. చివరి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో సత్తా చాటి తన కెరీర్‌ను ఘనంగా ముగించాడు. పాక్ బౌలర్ సాజిద్ ఖాన్ బౌలింగ్‌లో డేవిడ్ వార్నర్ ఎల్బీగా వెనుదిరగ్గా.. పాకిస్థాన్ ఆటగాళ్లంతా అతనికి అభినందనలు తెలిపారు. సిడ్నీ మైదానానికి వచ్చిన ప్రేక్షకులంతా అతని స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు.

విజయానంతరం మాట్లాడిన వార్నర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకోలేకపోయాడు. ఇది తన కల నేరవేరిన క్షణమని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా జట్టులో ఆడే అవకాశం దక్కినందుకు అదృష్టంగా భావిస్తున్నానని చెప్పాడు. గత 18 నెలల్లో ఆస్ట్రేలియా జట్టు అసాధారణ విజయాలు సాధించిందని, అందులో తాను భాగమైనందుకు చాలా గర్వపుడుతున్నానని తెలిపాడు.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ గెలవడం, యాషెస్ టెస్ట్ సిరీస్ సమం చేయడం, వన్డే ప్రపంచకప్ గెలవడం తన కెరీర్‌లో మరిచిపోలేని ఘటనలని, పాకిస్థాన్‌పై 3-0తో సిరీస్ గెలవడం కూడా గొప్ప ఘనతని వార్నర్ అభిప్రాయపడ్డాడు. ఇంతమంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నందుకు ఎంతో గర్వపడుతున్నానని తెలిపాడు.

తన కెరీర్‌కు సహకరించిన కోచ్‌లు, సహచర ఆటగాళ్లు.. తన కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. చివరి ఇన్నింగ్స్ అనంతరం పెవిలియన్ వెళ్లే క్రమంలో వార్నర్ తన హెల్మెట్, గ్లోవ్స్‌ను చిన్నారి అభిమానులకు అందజేశాడు. పాకిస్థాన్ కెప్టెన్ షాన్ మసూద్.. తమ ఆటగాళ్ల సంతకాలతో కూడిన జెర్సీని డేవిడ్ వార్నర్‌కు బహుమతిగా అందజేశాడు.

డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ నేపథ్యంలో మ్యాచ్‌కు హాజరైన ప్రేక్షకులందర్నీ మైదానంలో అనుమతించారు. డేవిడ్ వార్నర్ సతీమణి క్యాండిస్ వార్నర్, అతను కూతుళ్లు కూడా మైదానంలోకి రాగా వారిని హత్తుకొని వార్నర్ కన్నీటి పర్యంతమయ్యాడు.

13 ఏళ్ల టెస్ట్ కెరీర్‌లో 112 మ్యాచ్‌లు ఆడిన డేవిడ్ వార్నర్.. 44.59 సగటుతో 8786 పరుగులు చేశాడు. ఇందులో 26 శతకాలతో పాటు 37 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Story first published: Saturday, January 6, 2024, 9:35 [IST]
Other articles published on Jan 6, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+