Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

AUS vs NZ: ఫీల్డింగ్ చేస్తూ.. పుష్ప సాంగ్‌కు స్టెప్పులేసిన డేవిడ్ వార్నర్!(వీడియో)

AUS vs NZ: వన్డే ప్రపంచకప్ 2023లో ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ దుమ్మురేపుతున్నాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న వార్నర్.. ప్రతీ మ్యాచ్‌లోనూ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగుతున్నాడు. న్యూజిలాండ్‌తో ధర్మశాల వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో వార్నర్ అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగాడు.

65 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 81 పరుగులు చేసి తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. ఓ వైపు తన మెరుపు బ్యాటింగ్‌తో అభిమానులను అలరిస్తున్న డేవిడ్ వార్నర్.. మరోవైపు పుష్ప ట్రేడ్ మార్క్ సెలెబ్రేషన్స్‌, డ్యాన్స్‌లతో ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటికే చాలా మ్యాచ్‌ల్లో పుష్ప నీ అవ్వ తగ్గేదేలే అంటూ సెలెబ్రేట్ చేసుకున్న వార్నర్.. తాజాగా శ్రీవల్లి సాంగ్‌కు చిందేసాడు.

 AUS vs NZ: David Warner Dances To Pushpa’s Viral Song During World Cup 2023 goes viral

బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తూ శ్రీవల్లి పాటకు కాలు కదిపాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వార్నర్ డ్యాన్స్‌తో స్టేడియం మొత్తం హోరెత్తింది. డేవిడ్ వార్నర్ కారణంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కిందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా బన్నీ ఫ్యాన్స్.. డేవిడ్ వార్నర్‌ చేసిన పనులకు ఫిదా అవుతున్నారు.

అతని అభిమానులుగా మారిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా బన్నీ, వార్నర్ మధ్య సరాదా సంభాషణలు కూడా జరిగాయి. వార్నర్ బర్త్‌డే సందర్భంగా అల్లు అర్జున్.. అతనికి పుష్ఫ స్టైల్‌లో శుభాకాంక్షలు తెలిపాడు. వార్నర్ తగ్గేదేలే అనే అభినయం ఉన్న ఫోటో షేర్ చేస్తూ బన్నీ ఇలా విష్ చేశాడు.

'క్రికెట్ సూపర్ స్టార్ డేవిడ్ వార్నర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. నీ కలలు అన్ని నెరవేరాలని కోరుకుంటున్నా'అని కామెంట్ చేశాడు.

Story first published: Saturday, October 28, 2023, 16:19 [IST]
Other articles published on Oct 28, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+