Aus vs Eng: ఖవాజా ‘డబుల్’.. ఇంగ్లండ్ ట్రబుల్!

సిడ్నీ: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా టీమ్ జోరు కొనసాగుతోంది. ఇప్పటికే మూడు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి సిరీస్ కైవసం చేసుకున్న ఆసీస్.. నాలుగో టెస్ట్‌లో కూడా విజయం దిశగా దూసుకెళ్తుంది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగిన ఉస్మాన్ ఖవాజా.. రెండో ఇన్నింగ్స్‌లోనూ మరో శతకం బాదాడు.
నాలుగో రోజు ఆటలో భాగంగా 138 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 101 పరుగులతో అజేయంగా నిలిచాడు. దాంతో ఆసీస్ సెకండ్ ఇన్నింగ్స్‌ను 265/6 వద్ద డిక్లేర్ ఇచ్చింది. దాంతో ఇంగ్లండ్ ముందు 388 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది. ఇక ఖావాజాకు అండగా కామెరూన్ గ్రీన్ (122 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 74) హాఫ్ సెంచరీతో మెరిసాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ నాలుగు వికెట్లు తీయగా.. మార్క్ వుడ్ రెండు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం 388 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ నాలుగో రోజు ఆట ముగిసేసమయానికి 11 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 30 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓటమి నుంచి గట్టేక్కాలంటే చివరి రోజు అయిన శనివారం మొత్తం బ్యాటింగ్ చేయాలి.
అంతకుముందు 258/7 ఓవర్ నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ 294 పరుగులకు కుప్పకూలింది. జానీ బెయిర్ స్టో(158 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 113), బెన్ స్టోక్స్(91 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 66) మినహా అంతా విఫలమయ్యారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 416/8 డిక్లేర్ ఇవ్వడంతో 122 పరుగుల ఆధిక్యం లభించింది.
ఇక అనూహ్యంగా జట్టులోకి వచ్చిన ఉస్మాన్ ఖావాజా అద్భుత ప్రదర్శన కనబర్చాడు. కరోనా వైరస్ బారిన పడటంతో ట్రావిస్ హెడ్ ఈ మ్యాచ్‌కు దూరం కాగా.. ఖవాజాకు అవకాశం దక్కింది. దాంతో సుమారు రెండేళ్ల తర్వాత ఖవాజా జట్టులోకి వచ్చాడు. ఈ అవకాశాన్ని రెండు సెంచరీలతో అందిపుచ్చుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 137 పరుగులతో రాణించిన ఖవాజా.. నాలుగో రోజు ఆటలో భాగంగా 101 పరుగులతో అజేయంగా నిలిచి డబుల్ ధమాకాతో ప్రత్యర్థి జట్టును ట్రబుల్ చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications