For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

AUS vs ENG: ఆస్ట్రేలియా విజయం వెనుక ట్రావిస్ హెడ్ విధ్వంసం!

ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ తన ఐపీఎల్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఇంగ్లండ్‌తో శనివారం అర్థరాత్రి జరిగిన మ్యాచ్‌లో ఈ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 18 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34 పరుగులు చేసి జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు.

తన ఫియర్‌లెస్ గేమ్‌తో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేసాడు. అతనికి తోడుగా డేవిడ్ వార్నర్(16 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 39) మెరుపులు మెరిపించడంతో పవర్ ప్లేలోనే ఆస్ట్రేలియా 74 పరుగులు చేసింది. ఇంగ్లండ్ స్పిన్నర్ మొయిన్ అలీ వేసిన తొలి ఓవర్‌లో మూడు పరుగులే రాగా.. బట్లర్ రెండో ఓవర్‌ను పార్ట్‌టైమ్ స్పిన్నర్ విల్ జాక్స్‌కు ఇచ్చాడు.

AUS vs ENG Travis Head s quick fire knock helps Australia to 36 runs win against England in T20 WC

ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న ట్రావిస్ హెడ్ అతని ఓవర్‌లో రెండు భారీ సిక్స్‌లు బాదాడు. వార్నర్ కూడా ఓ సిక్స్ కొట్టడంతో 22 పరుగులు వచ్చాయి. మోయిన్ అలీ వేసిన నాలుగో ఓవర్‌లో ట్రావిస్ హెడ్ వరుసగా 6, 4 బాదగా.. వార్నర్ బౌండరీ బాది ఔటయ్యాడు. ఆర్చర్ బౌలింగ్‌లో మరో బౌండరీ బాదిన ట్రావిస్ హెడ్ మరుసటి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

ఐపీఎల్ 2024 సీజన్‌లో సంచలన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న ట్రావిస్ హెడ్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు రికార్డ్ స్కోర్లు అందించాడు. ట్రావిస్ హెడ్ బ్యాట్ ఝులిపించిన ప్రతీసారి సన్‌రైజర్స్ భారీ విజయాన్ని నమోదు చేసింది. విఫలమైనప్పుడు మాత్రం ఓటమిపాలైంది. ప్రపంచకప్‌లోనూ ట్రావిస్ హెడ్ ఆసీస్ తరఫున అదే పాత్రను పోషిస్తున్నాడు.

తన ఫియర్‌లెస్ గేమ్‌తో అదిరిపోయే ఆరంభాలు అందిస్తున్నాడు. ఓపెనర్లు అందించిన శుభారంభాన్ని మిచెల్ మార్ష్(25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 35), గ్లేన్ మ్యాక్స్‌వెల్(25 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 28), మార్కస్ స్టోయినీస్(17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30) భారీ స్కోర్‌గా మలిచారు.

ఆసీస్ టాప్-5 బ్యాటర్లు సత్తా చాటడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 201 పరుగులు చేసింది. ఈ ప్రపంచకప్‌లో 200 ప్లస్ రన్స్ చేసిన తొలి జట్టుగా ఆసీస్ రికార్డ్ నమోదు చేసింది.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 165 పరుగులే చేసి ఓటమిపాలైంది. జోస్ బట్లర్(47 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42), ఫిల్ సాల్ట్(23 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37), హ్యారీ బ్రూక్(16 బంతుల్లో 2 ఫోర్లతో 20 నాటౌట్) పర్వాలేదనిపించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ప్యాట్ కమిన్స్(2/23), ఆడమ్ జంపా(2/28) రెండేసి వికెట్లు తీయగా.. జోష్ హజెల్‌వుడ్, మార్కస్ స్టోయినీస్ తలో వికెట్ తీసారు. ఆడమ్ జంపా, కమిన్స్ ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు.

Story first published: Sunday, June 9, 2024, 10:16 [IST]
Other articles published on Jun 9, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+