For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

AUS vs ENG T20 WC: చెలరేగిన బౌలర్లు.. చేతులెత్తేసిన ఆసీస్.. ఇంగ్లండ్ ముందు ఈజీ టార్గెట్!

England bundle out Australia on 125

దుబాయ్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ దారుణంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లు క్రిస్ జోర్డాన్(3/17), క్రిస్ వోక్స్(2/23), లివింగ్‌స్టోన్ (1/15) ధాటికి పెవిలియన్‌కు క్యూ కట్టారు. కెప్టెన్ ఆరోన్ ఫించ్(49 బంతుల్లో 4 ఫోర్లతో 44) మినహా ఎవరూ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. దాంతో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 125 పరుగులు మాత్రమే చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ మూడు వికెట్లు తీయగా.. టైమిల్ మిల్స్, క్రిస్ వోక్స్ తలో రెండు వికెట్లు తీశారు. ఆదిల్ రషీద్, లియామ్ లివింగ్ స్టోన్‌కు తలో వికెట్ దక్కింది.

q ఆసీస్‌కు ఇన్నింగ్స్ ఆరంభలోనే షాక్‌ తగిలింది. ఓపెనర్‌ డేవిడ్ వార్నర్‌ (1), స్టీవ్ స్మిత్‌ (1), గ్లెన్‌ మాక్స్‌ వెల్‌ (6), మార్కస్‌ స్టొయినిస్ (0) వరుసగా పెవిలియన్‌ చేరారు. రెండో ఓవర్లో వార్నర్‌ ఔట్ కాగా.. మూడో ఓవర్‌ తొలి బంతికే స్టీవ్‌ స్మిత్‌ పెవిలియన్ చేరాడు. క్రిస్ వోక్స్‌ వేసిన నాలుగో ఓవర్లో మాక్స్ వెల్ ఎల్బీగా వెనుదిరిగాడు. అదిల్‌ రషీద్‌ వేసిన ఏడో ఓవర్లో మార్కస్‌ స్టొయినిస్ కూడా వికెట్ల ముందు దొరికిపోయాడు.

ఆ తర్వాత క్రీజులోకి మాథ్యూ వేడ్‌ (18)తో కలిసి.. ఆరోన్‌ ఫించ్‌ ఇన్నింగ్స్‌ని చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. నిలకడగా ఆడుతూ పరుగులు రాబట్టారు. పది ఓవర్లు పూర్తయ్యే సరికి ఆస్ట్రేలియా 41/4 స్కోరుతో నిలిచింది. ఈ క్రమంలోనే లివింగ్‌స్టోన్‌ వేసిన 12వ ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించిన మాథ్యూ వేడ్.. జేసన్‌ రాయ్‌కి చిక్కి పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌ వచ్చిన ఆష్టన్ అగర్ (20)తో కలిసి ఫించ్ ఇన్నింగ్స్‌ని ముందుకు నడిపించాడు.

ఈ జోడీ 17వ ఓవర్లో 20 పరుగులు రాబట్టింది. టైమల్ మిల్స్‌ వేసిన 18వ ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించిన అగర్‌.. లివింగ్‌స్టోన్‌కి క్యాచ్ ఇచ్చాడు. క్రిస్ జోర్డాన్ వేసిన 19వ ఓవర్లో వరుస బంతుల్లో ఆరోన్‌ ఫించ్‌, ప్యాట్‌ కమ్మిన్స్‌ (12)ని పెవిలియన్‌ చేర్చాడు. ఆడమ్‌ జంపా (1), మిచెల్ స్టార్క్ (13) పరుగులు చేశారు. ఆసీస్‌ ఆఖరి నాలుగు ఓవర్లలో 50 పరుగులు రాబట్టింది. దీంతో ఇంగ్లాండ్ ముందు మోస్తరు లక్ష్యాన్ని ఉంచగలిగింది.

Story first published: Saturday, October 30, 2021, 22:56 [IST]
Other articles published on Oct 30, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+