For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

AUS vs ENG T20 WC: జోస్ బట్లర్ విధ్వంసం.. ఆసీస్‌పై ఇంగ్లండ్ ఘన విజయం!

All-round England demolish Australia by eight wickets

దుబాయ్: టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా మూడో విజయాన్నందుకున్న ఆ జట్టు సెమీస్‌కు మరింత చేరువైంది. ఆస్ట్రేలియాతో శనివారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్నందుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 125 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ ఆరోన్ ఫించ్(49 బంతుల్లో 4 ఫోర్లతో 44) మినహా ఎవరూ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. కెప్టెన్ ఆరోన్ ఫించ్(49 బంతుల్లో 4 ఫోర్లతో 44) మినహా ఎవరూ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్.. 11.4 ఓవర్లలోనే 2 వికెట్లకు 126 పరుగులు చేసి 50 బంతులు మిగిలుండగానే సునాయస విజయాన్నందుకుంది. ఇంగ్లండ్ ఓపెనర్ జోస్ బట్లర్(32 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 71 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. జాసన్ రాయ్(22), జానీ బెయిర్ స్టో(16 నాటౌట్) కీలక పరుగులు చేశారు. డేవిడ్ మలాన్(8) దారుణంగా విఫలమయ్యాడు. ఆసీస్ బౌలర్లలో జంపా, అగర్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌పై మంచు చాలా ప్రభావం చూపింది. దాంతో ముందుగా ఫీల్డింగ్ చేసిన జట్టుకు అడ్వాంటేజ్‌గా మారింది.

స్వల్ప లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఓపెనర్లు జాసన్ రాయ్, జోస్ బట్లర్ ధాటిగా ఆడారు. తొలి ఓవర్‌లోనే బట్లర్ బౌండరీ బాదగా.. రెండో ఓవర్‌లో జాసన్ రాయ్ కూడా బౌండరీ బాదాడు. ఈ ఇద్దరు పోటాపడి మరి బౌండరీలు బాదారు. దాంతో ఇంగ్లండ్ స్కోర్ బోర్డు పరుగెత్తింది. ఇక స్టార్క్ వేసిన ఆరో ఓవర్‌లో బట్లర్ రెండు బారీ సిక్స్‌లు బాదగా.. పవర్ ప్లేలోనే ఇంగ్లండ్ 66 పరుగులు చేసింది. అయితే ఆ వెంటనే ఆడమ్ జంపా బౌలింగ్‌లో జాసన్ రాయ్ ఎల్బీగా వెనుదిరగాడు. వికెట్ కోల్పోయినా బట్లర్ తన జోరును తగ్గించలేదు. స్టార్క్ వేసిన 8వ ఓవర్‌లో మూడు బౌండరీలు బాదాడు. ఆడమ్ జంపా వేసిన మరుసటి ఓవర్‌లో సిక్స్ బాది 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అగర్ బౌలింగ్‌లో డేవిడ్ మలాన్ ఔటైనా.. క్రీజులోకి వచ్చిన బెయిర్ స్టోతో బట్లర్ ఇంగ్లండ్ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.

అంతకు ముందు ఆసీస్‌కు ఇన్నింగ్స్ ఆరంభలోనే షాక్‌ తగిలింది. ఓపెనర్‌ డేవిడ్ వార్నర్‌ (1), స్టీవ్ స్మిత్‌ (1), గ్లెన్‌ మాక్స్‌ వెల్‌ (6), మార్కస్‌ స్టొయినిస్ (0) వరుసగా పెవిలియన్‌ చేరారు. రెండో ఓవర్లో వార్నర్‌ ఔట్ కాగా.. మూడో ఓవర్‌ తొలి బంతికే స్టీవ్‌ స్మిత్‌ పెవిలియన్ చేరాడు. క్రిస్ వోక్స్‌ వేసిన నాలుగో ఓవర్లో మాక్స్ వెల్ ఎల్బీగా వెనుదిరిగాడు. అదిల్‌ రషీద్‌ వేసిన ఏడో ఓవర్లో మార్కస్‌ స్టొయినిస్ కూడా వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత క్రీజులోకి మాథ్యూ వేడ్‌ (18)తో కలిసి.. ఆరోన్‌ ఫించ్‌ ఇన్నింగ్స్‌ని చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. నిలకడగా ఆడుతూ పరుగులు రాబట్టారు. పది ఓవర్లు పూర్తయ్యే సరికి ఆస్ట్రేలియా 41/4 స్కోరుతో నిలిచింది.

ఈ క్రమంలోనే లివింగ్‌స్టోన్‌ వేసిన 12వ ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించిన మాథ్యూ వేడ్.. జేసన్‌ రాయ్‌కి చిక్కి పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌ వచ్చిన ఆష్టన్ అగర్ (20)తో కలిసి ఫించ్ ఇన్నింగ్స్‌ని ముందుకు నడిపించాడు. ఈ జోడీ 17వ ఓవర్లో 20 పరుగులు రాబట్టింది. టైమల్ మిల్స్‌ వేసిన 18వ ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించిన అగర్‌.. లివింగ్‌స్టోన్‌కి క్యాచ్ ఇచ్చాడు. క్రిస్ జోర్డాన్ వేసిన 19వ ఓవర్లో వరుస బంతుల్లో ఆరోన్‌ ఫించ్‌, ప్యాట్‌ కమ్మిన్స్‌ (12)ని పెవిలియన్‌ చేర్చాడు. ఆడమ్‌ జంపా (1), మిచెల్ స్టార్క్ (13) పరుగులు చేశారు. ఆసీస్‌ ఆఖరి నాలుగు ఓవర్లలో 50 పరుగులు రాబట్టింది. దీంతో ఇంగ్లాండ్ ముందు మోస్తరు లక్ష్యాన్ని ఉంచగలిగింది.

Story first published: Saturday, October 30, 2021, 23:04 [IST]
Other articles published on Oct 30, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+