టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న బిగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తెలిపాడు.
'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నా. ఆస్ట్రేలియా వంటి బిగ్ టీమ్‌తో ప్రపంచకప్ మ్యాచ్ ఆడటం సంతోషపరిచే విషయం. కొన్ని విషయాల్లో మేం మెరుగవ్వాల్సి ఉంది. ఈ మ్యాచ్‌ను అందుకు వాడుకుంటాం. ఈ బిగ్ మ్యాచ్ కోసం మేం అన్ని విధాల సిద్దమయ్యాం. ఇటీవల ఆస్ట్రేలియాపై మేం మెరుగైన ప్రదర్శన చేశాం. కానీ గతంతో పనిలేదు. మేం తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.'అని జోస్ బట్లర్ తెలిపాడు.

మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్ మిచెల్ మార్ష్ తెలిపాడు. ప్యాట్ కమిన్స్ జట్టుకు అందుబాటులోకి రావడంతోనే అతన్ని తుది జట్టులోకి తీసుకున్నామని మిచెల్ మార్ష్ చెప్పుకొచ్చాడు. 'మేం కూడా ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. ఎందుకంటే పిచ్ పరిస్థితులు, వాతవారణ పరిస్థితులు అలా ఉన్నాయి. మేం టోర్నీ గెలిచేందుకు ఇక్కడికి వచ్చాం. ఇది చాలా బిగ్ మ్యాచ్.
ఆస్ట్రేలియాకు సారథ్యం వహించడం గొప్ప అనుభూతిని ఇస్తోంది. మా జట్టులో నా చుట్టూ అనుభవం కలిగిన ఆటగాళ్లతో పాటు మ్యాచ్ విన్నర్స్ ఎందరో ఉన్నారు. ఈ మ్యాచ్ మాకు పెద్ద సవాల్. తుది జట్టులో ఒక మార్పు చేశాం. నాథన్ ఎల్లిస్‌కు బదులు ప్యాట్ కమిన్స్ జట్టులోకి వచ్చాడు.'అని మిచెల్ మార్ష్ చెప్పుకొచ్చాడు.
తుది జట్లు:
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినీస్, టీమ్ డేవిడ్, మాథ్యూ వేడ్, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హజెల్ వుడ్
ఇంగ్లండ్: జోస్ బట్లర్, ఫిలిప్ సాల్ట్, విల్ జాక్స్, జానీ బెయిర్ స్టో, హ్యారీ బ్రూక్, మోయిన్ అలీ, లియామ్ లివింగ్ స్టోన్, క్రిస్ జోర్డాన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్