For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

AUS vs ENG: పోస్టర్‌తో డేవిడ్ వార్నర్‌ను పడేసిన బుడ్డోడు.. టీవీ కెమెరాలన్నీ అతని వైపే! (వీడియో)

AUS vs ENG: Kid holds up poster asking David Warners t-shirt goes viral

అడిలైడ్: క్రికెట్ మ్యాచ్‌లను చూసేందుకు వచ్చే అభిమానులు తమ ప్లకార్డులతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. గతంలో ఓ అమ్మాయి.. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ చేసే వరకు పెళ్లి చేసుకోనని ప్లకార్డు చూపించి వార్తల్లో నిలిచింది. తాజాగా అలాంటి సంఘటనే ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య జరిగిన తొలి వన్డే సందర్భంగా చోటు చేసుకుంది. మ్యాచ్ సీరియస్‌గా జరుగుతుండగా.. ప్రేక్షకుల గ్యాలరీలోనే ఓ చిన్నారి.. 'వార్నర్ నాకు నీ టీషర్ట్ కావాలి.. ఇస్తావా?'అని ప్లకార్డు ప్రదర్శించాడు.


డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న వార్నర్.. ఈ ప్లకార్డుకు బదులివ్వడంతో ఆ చిన్నోడు అందరి దృష్టిని ఆకర్షించాడు. డ్రెస్సింగ్‌రూమ్‌లో పక్కనే ఉన్న మార్నస్ లబుషేన్.. జాకెట్‌పై సంతకం చేసి ఆ చిన్నారికి ఇవ్వంటూ డేవిడ్ వార్నర్‌కు సలహా ఇచ్చాడు. ఆ వెంటనే మరో అభిమాని 'మార్నస్ లబుషేన్ నాకు నీ షర్ట్ కావాలి?'అని ప్లకార్డు ప్రదర్శించాడు. దాంతో ఆసీస్ డ్రెస్సింగ్‌ రూమ్‌లో నవ్వులు పూసాయి. ఇక వార్నర్.. 'మ్యాచ్ తర్వాత వచ్చి కలువు.. నా జాకెట్ ఇస్తా'అని ప్లకార్డు ప్రదర్శించి ఆ చిన్నారిని సంతోషపరిచాడు. ఈ ఘటనను టీవీ కెమెరాలు చూపించడంతో కామెంటేటర్లు సైతం నవ్వుకున్నారు. ఈ వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా సోషల్ మీడియా వేదికగా పంచుకోగా.. నెట్టింట వైరల్ అయ్యింది.

ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. దాంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 287 పరుగులు చేసింది. డేవిడ్ మలాన్(128 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 134) ఒక్కడే సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలలో ఆడమ్ జంపా, ప్యాట్ కమిన్స్ మూడేసి వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినీస్ తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా 46.5 ఓవర్లలో 4 వికెట్లకు 291 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్(84 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 86), ట్రావిస్ హెడ్(57 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 69) హాఫ్ సెంచరీలతో రాణించగా.. స్టీవ్ స్మిత్(78 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 80 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లే రెండు వికెట్లు తీయగా.. క్రిస్ జోర్డాన్, లియామ్ డాసన్ తలో వికెట్ తీసారు.

Story first published: Thursday, November 17, 2022, 19:25 [IST]
Other articles published on Nov 17, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+