అసలేం జరిగిందంటే..?
ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 45వ ఓవర్‌లో ఈ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అప్పటికే సెంచరీ పూర్తి చేసుకున్న డేవిడ్ మలాన్.. ప్యాట్ కమిన్స్ వేసిన ఈ ఓవర్ ఐదో బంతిని డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ ఆడాడు. బంతి గాల్లోకి దూసుకెళ్లడంతో అంతా సిక్స్ అనుకున్నారు. కానీ అక్కడే బౌండరీ లైన్ వద్ద ఉన్న అష్టన్ అగర్.. సూపర్ మ్యాన్‌లా గాల్లో ఎగిరి బంతిని ఒంటి చేత్తో అందుకున్నాడు.
అయితే బౌండరీ లైన్ ధాటి ఉన్నానని గమనించిన అతను తెలివిగా బంతిని లోపలికి విసిరేసాడు. దాంతో సిక్సర్ కాస్త సింగిల్‌గా మారిపోయింది. అంతకు ముందు అదిరిపోయే త్రోతో ఇంగ్లండ్ బ్యాటర్ లియామ్ డసన్‌ను రనౌట్‌గా పెవిలియన్ చేర్చాడు.

డేవిడ్ మలాన్ సెంచరీ..
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 287 పరుగులు చేసింది. డేవిడ్ మలాన్(128 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 134) ఒక్కడే సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. డేవిడ్ విల్లే(34 నాటౌట్), జోస్ బట్లర్(29) కాస్త పర్వాలేదనిపించారు.
31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను మలాన్ సెంచరీతో ఆదుకున్నాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా.. మరోవైపు క్రీజులో పాతుకుపోయి జట్టుకు కావాల్సిన స్కోర్ అందించాడు.ఆసీస్ బౌలర్లలలో ఆడమ్ జంపా, ప్యాట్ కమిన్స్ మూడేసి వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినీస్ తలో వికెట్ పడగొట్టారు.

చెలరేగిన డేవిడ్ వార్నర్..
288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు డేవిడ్ వార్నర్(84 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 86), ట్రావిస్ హెడ్(57 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 69) హాఫ్ సెంచరీలతో శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 147 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. మార్నస్ లబుషేన్ విఫలమైనా.. వార్నర్ రాణించడంతో ఆ జట్టు 31 ఓవర్లలో 3 వికెట్లుకు 208 పరుగులు చేసింది. క్రీజులో స్టీవ్ స్మిత్(39 బ్యాటింగ్), అలెక్స్ క్యారీ(4 బ్యాటింగ్) ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లే 2 వికెట్లు తీయగా.. క్రిస్ జోర్డాన్ ఓ వికెట్ పడగొట్టాడు. ఆసీస్ విజయానికి 19 ఓవర్లలో 80 పరుగులు కావాలి.


Click it and Unblock the Notifications












