AUS vs BAN: డేంజరస్‌గా ఆస్ట్రేలియా.. భారీ స్కోర్ చేసినా బంగ్లాదేశ్‌కు దక్కని విజయం!
AUS vs BAN, World Cup 2023: వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీని బంగ్లాదేశ్ ఓటమితో ముగించింది. శనివారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ ఓటమిపాలైంది. 306 పరుగుల భారీ స్కోర్ చేసినా బంగ్లాదేశ్‌కు విజయం దక్కలేదు. అసాధారణ ప్రదర్శనతో సెమీస్ చేరిన ఆసీస్.. విధ్వంసకర ఆటతో అద్భుత విజయాన్ని అందుకుంది.
టోర్నీ ఆరంభంలో పేలవ ప్రదర్శనతో చతికిలపడిన ఆసీస్.. నాకౌట్ అర్హత సాధించిన తర్వాత ఒకప్పటి టీమ్‌లో దూసుకెళ్తోంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 306 పరుగులు చేసింది. టౌహిడ్ హృదయ్(79 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 74) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. లిటన్ దాస్(36), టాన్జిద్ హసన్(36), మహ్మదుల్లా(32) కీలక ఇన్నింగ్స్ ఆడారు.

ఆసీస్ బౌలర్లలో సీన్ అబాట్, ఆడమ్ జంపా రెండేసి వికెట్లు తీయగా.. మార్కస్ స్టోయినీస్ ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆసీస్ మిచెల్ మార్ష్(132 బంతుల్లో 17 ఫోర్లు, 9 సిక్స్‌లతో 177 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో 44.4 ఓవర్లలో 2 వికెట్లకు 307 పరుగులు చేసి సునాయస విజయాన్ని అందుకుంది.
డేవిడ్ వార్నర్(61 బంతుల్లో 6 ఫోర్లతో 53), స్టీవ్ స్మిత్(64 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 63 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో టస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ తలో వికెట్ తీసారు.
ఈ టోర్నీలో బంగ్లాదేశ్ దారుణంగా విఫలమైంది. 9 మ్యాచ్‌ల్లో రెండు విజయాలు మాత్రమే నమోదు చేసి పాయింట్స్ టేబుల్‌లో 8వ స్థానంలో నిలిచింది. ఈ పేలవ ప్రదర్శనతో 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి నేరుగా అర్హత సాధించలేకపోయింది. అఫ్గానిస్థాన్‌పై తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన బంగ్లాదేశ్.. శ్రీలంకపై గత మ్యాచ్‌లో గెలుపొందింది.
మరోవైపు ఆసీస్.. నవంబర్ 16న కోల్‌కతా వేదికగా జరిగే సెమీఫైనల్-2లో సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications